విజయ్‌ దేవరకొండ 'మజిలీ' ఎలా ఉంటుంది?

నానితో ‘నిన్ను కోరి’ అనే విభిన్నమైన చిత్రంను తీసినప్పుడు దర్శకుడు శివ నిర్వాన గురించి అంతా మాట్లాడుకున్నారు.అయితే ఇలాంటి స్క్రీన్‌ప్లేతో, కథలతో సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆధరిస్తారా అనే అనుమానాలు ఉన్న ప్రేక్షకులకు శివ నిర్వాన మంచి సమాధానం ఇచ్చాడు.

 Siva Nirvana Next Movie With Vijay Devara Konda-TeluguStop.com

ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీలను ఆసక్తికరంగా చూపడంలో దర్శకుడు శివ నిర్వాన అందెవేసిన చేయి అని మరోసారి ‘మజిలీ’ చిత్రంతో నిరూపించుకున్నాడు.ఒక విభిన్నమైన లవ్‌ స్టోరీని సినిమాగా చేసి నాగచైతన్య మరియు సమంతలకు మంచి సక్సెస్‌ను అందించిన దర్శకుడు శివ నిర్వాన ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో ఒక సినిమాను చేసే అవకాశం కనిపిస్తుంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘మజిలీ’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న దర్శకుడు శివ నిర్వాన తన తదుపరి చిత్రంను విజయ్‌ దేవరకొండతో చేయాలని ఉవ్విల్లూరుతున్నాడు.సినిమా సినిమాకు రెండేళ్ల సమయం తీసుకుంటున్న దర్శకుడు శివ నిర్వాన తదుపరి చిత్రం కూడా 2020 చివర్లో లేదా ఆ తర్వాత ఏడాది శివ నిర్వాన సినిమా ఉండే అవకాశం ఉంది.అప్పటి వరకు విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేస్తాడు.

మంచి కథతో విజయ్‌ దేవరకొండను ఒప్పించాలని శివ నిర్వాన ప్రయత్నాలు చేస్తున్నాడు.విజయ్‌ దేవరకొండ ఎక్కువగా కథలకు ప్రాముఖ్యత ఇస్తాడు.అందుకే శివ నిర్వాన చెప్పే కథకు తప్పకుండా విజయ్‌ దేవరకొండ ఓకే చెప్తాడనే నమ్మకం అందరిలో ఉంది.

త్వరలో డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో రాబోతున్న విజయ్‌ దేవరకొండ ఆ తర్వాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో సినిమాతో రానున్నాడు.ఆ తర్వాత కూడా ఇంకా పలు కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి.

విజయ్‌ దేవరకొండ ‘మజిలీ’ వంటి ఒక ఎమోషనల్‌ డ్రామా సినిమాను చేస్తే నటనతో పిండేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube