వివాహం కానీ అమ్మాయిలు శివుణ్ణి ఇలా పూజిస్తే....  

 • శివుణ్ణి బోళా శంకరుడు అని అంటారు. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కోరిన వరాలు ఇచ్చేస్తారు. శివుణ్ణి భక్తితో నమస్కరిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. శివునికి బిల్వ పత్రాలంటే చాలా ఇష్టం. వాటితో అర్చన చేస్తే మంచిది. శివుణ్ణి భక్తితో పూజిస్తే తెలివితేటలు, మానసిక ప్రశాంతత కలగటమే కాకుండా జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. శివుణ్ణి ఆరాదిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు. ఒకవేళ వచ్చిన వెంటనే సమసిపోతాయి.

 • -

 • ముఖ్యంగా పెళ్లి కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా శివుణ్ణి ఆరాదిస్తే పెళ్ళికి ఉన్న ఆటంకాలు అన్ని తొలగిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. శ్రీ మహా విష్ణువు పార్వతికి శివారాధన ఎలా చేయాలో చెప్పారు. 11 మంత్రాలతో శివుణ్ణి ఆరాదిస్తే మనసులోని కోరికలు నెరవేరతాయి. అలాగే పెళ్లి కానీ వారికీ పెళ్లి త్వరగా అవుతుంది.

 • ఈ 11 నామాలు శివుని శరీరంలోని ఒక్కో భాగానికి సంబందించినవి. ఇప్పుడు ఆ నామాల గురించి తెలుసుకుందాం. ఈ నామాలను భక్తితో ఉచ్చరిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి.

 • 1. ఓం హ్రీం హృదయా నమ: – హృదయాన్ని ఆరాధించడం.

 • 2. ఓం హ్రీం ష్రైసే స్వాహ. – శిరస్సును పూజించడం.

 • 3. ఓం హ్రీం శిఖాయి వషత్. – శివుని జాటజూటాన్ని అభిషేకించడం.

 • 4. ఓం హ్రీం కవచాయ నమ:- శివుని కీర్తిని శ్లాఘించడం.

 • 5. ఓం హ్రీం నేత్ర త్రయాయ వషత్ -కనులను పూజించడం.

 • 6. ఓ హర అస్త్రాయ పహత్ – భుజాలను అభిషేకించడం.

 • 7. ఓం హ్రం సద్యయోజటాయ నమ:

 • 8. ఓం హ్రీం వామదేవాయ నమ:

 • 9. ఓం హ్రీం అఘోరాయ నమ:

 • 10. ఓం హ్రీం తత్పురుషాయ నమ:

 • 11. ఓం హ్రీం ఇష్ణాయ నమ: