కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తెలుగులో డైరెక్ట్ సినిమా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.జాతి రత్నాలు డైరక్టర్ అనుదీప్ కెవితో శివ కార్తికేయన్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో నారాయణ దాస్ నారంగ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఈమధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ల నుంది.
ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ తన రెండో తెలుగు సినిమాని కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
రీసెంట్ గా సంక్రాంతికి సూపర్ హిట్ అందుకున్న బంగార్రాజు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణతో శివ కార్తికేయన్ సినిమా ఉంటుందని టాక్.
బంగార్రాజు హిట్ కొట్టగానే తమిళ నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవెల్ రాజా కళ్యాణ్ కృష్ణని కలిసి బైలింగ్వల్ మూవీ ఎనౌన్స్ చేశారు.ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా శివ కార్తికేయన్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఆల్రెడీ తెలుగులో అనుదీప్ తో సినిమా చేస్తున్న శివ కార్తికేయన్ తన రెండో బైలింగ్వల్ మూవీ కళ్యాణ్ కృష్ణతో చేస్తున్నాడని టాక్.మొత్తానికి రెండు తెలుగు స్ట్రైట్ సినిమాలతో శివ కార్తికేయన్ తెలుగు ఆడియెన్స్ కు దగ్గరవ్వాలని చూస్తున్నాడు.