శివ కార్తికేయన్ 30 కోట్లు.. తగ్గేదేలే..!

కోలీవుడ్ హీరో యువ సెన్సేషన్ శివ కార్తికేయన్ ఈమధ్యనే వరుణ్ డాక్టర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.సినిమా తమిళంలో తెరకెక్కినా తెలుగులో డబ్బింగ్ వర్షన్ రిలీజై సూపర్ హిట్ అందుకుంది.

 Siva Karthikeyan 30 Crores Remuneration Demand, Siva Karthikeyan, Remuneration ,-TeluguStop.com

ఇక లేటెస్ట్ గా శివ కార్తికేయన్ తన నెక్స్ట్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీ చేస్తున్నారు.జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ కెవి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో నారాయణ దాస్, సునీల్ నారంగ్ ఈ మూవీ నిర్మిస్తున్నారు.

సినిమా కోసం శివ కార్తికేయన్ 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.తమిళంలో శివ కార్తికేయన్ కు 60 కోట్ల దాకా మార్కెట్ ఉంది.

ఈసారి తెలుగులో కూడా డైరెక్ట్ గా రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి అతను అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా చేస్తున్నారట.జాతిరత్నాలు సినిమాతో టాలెంట్ చూపించిన అనుదీప్ ఈ సినిమాతో శివ కార్తికేయన్ కు తెలుగులో సూపర్ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు.

మన దగ్గర స్టార్స్ సైతం పాతిక కోట్లు తీసుకుంటుంటే అక్కడ శివ కార్తికేయన్ 30 కోట్లు డిమాండ్ చేయడం షాకింగ్ గా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube