శ్రీకాకుళం యాసతో అదరగొట్టిన సిత్తరాల సిరపడు  

స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

TeluguStop.com - Sittarala Sirapadu Lyrical Song From Ala Vaikuntapuramulo

ఈ సినిమా సంగీతం గురించి ఎంత చెప్పుకునే తక్కువని చెప్పాలి.థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.ముఖ్యంగా పాటలు ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పొచ్చు.సామజవరగమన, రాములో రాములా వంటి పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాయి.

ఈ పాటలు సోషల్ మీడియాను చెడుగుడు ఆడుకున్న విషయం తెలిసిందే.యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించాయి ఈ పాటలు.

కాగా ఈ సినిమాలో ఓ ఫైట్ సీన్‌లో వచ్చే పాటను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.శ్రీకాకుళం యాసతో సాగే ఈ పాట ‘సిత్తరాల సిరపడు.

’ అంటూ సాగుతుంది.ఈ పాటకు థమన్ అందించిన మ్యూజిక్ ఈ పాటను మరో సూపర్ హిట్‌గా మలిచింది.

సింగర్స్ సూరన్న, సాకేత్ ఈ పాటను పాడిన తీరు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది.

మొత్తానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని అంశాలు బాగా తోడ్పడటంతో ‘అల వైకుంఠపురములో’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రికార్డు కలెక్షన్స్ వస్తున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు