వైరల్ వీడియో: మరాఠిలో గణపతి హారతి పాట పాడుతున్న సితార పాప..!

ఘట్టమనేని కుటుంబ గారాలపట్టి సితార పాప ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూన్న సంగతి అందరికి తెలిసిన సంగతే.తరచూ సోషల్ మీడియాలో తన వీడియోలను షేర్ చేస్తూ బాగా యాక్టివ్ గా ఉంటుంది సితార పాప.

 Sithara Papa Singing Ganapati Harathi In Marathi  Mahesh Babu, Gattamaneni Famil-TeluguStop.com

సితార ఎప్పడికప్పుడు తను చేసే పనులను వీడియో రూపంలో బంధించి వాటిని మహేష్ బాబు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అంతే కాదు సితార పాపకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.

అందులో సితార తన ఫ్రెండ్ ఆరాధ్యతో కలిసి వారికి నచ్చిన అంశంపై తెగ చర్చలు కూడా చేస్తుంటారు.

ఇకపోతే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ద్వారా సితార పాప మరాఠీ లో నేర్చుకున్న గణపతి సోత్రాన్ని చెప్పే సమయంలో తీసిన వీడియో ని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం మహేష్ బాబు అభిమానుల్లో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో లో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా తన ట్యాబ్ లో ఏదో బిజీగా చూస్తున్నాడు.

దీన్నిబట్టి సితార మరాఠీ నేర్చుకున్నట్టు అర్థమవుతుంది.ఇందుకు కారణం లేకపోలేదు.అదేమిటంటే… సితార తల్లి నమ్రత మరాఠీ అనే విషయం తెలుసు కదా.

ఇక ఇప్పటికే సితార తన తండ్రి నటించిన ‘ సరిలేరు నీకెవ్వరు ‘ సినిమాలోని పాటలకు, బాహుబలి చిత్రం లోని కొన్ని పాటలకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.ఇందుకు సంబంధించిన షూటింగ్ వచ్చే నెల నుండి మొదలు కాబోతోంది.ఆ తదుపరి మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube