బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈమధ్యనే వచ్చిన అఖండతో హ్యాట్రిక్ హిట్ కూడా పడ్డది.సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు సూపర్ హిట్ కాగా ఇక వీరి కాంబినేషన్ లో నాల్గవ సినిమా కూడా త్వరలోనే ఉండబోతుందని తెలుస్తుంది.బిబి4 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.ఈ కాంబినేషన్ మూవీని ఈసారి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కిస్తుందని తెలుస్తుంది.
టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్యానర్ లో సితార బ్యానర్ ఒకటి.అభిరుచి గల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారధ్యంలో సితార బ్యానర్ నడుస్తుంది.ప్రస్తుతం ఈ బ్యానర్ లో మీడియం బడ్జెట్ సినిమాలతో పాటుగా భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న భీమ్లా నాయక్ ఈ బ్యానర్ లోనే వస్తుంది.మరి బిబి4 సినిమా ఈ బ్యానర్ లో వస్తుంది అంటే మరోసారి నందమూరి ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.బిబి4 సినిమా ఈసారి అంచనాలకు మించి అనిపించేలా ఉంటుందని అంటున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు.
ఆ సినిమా తర్వాత బిబి4 ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.