బాలీవుడ్ లో వచ్చిన సినిమా వచ్చినట్లుగా ఫ్లాప్ అవుతుంటే టాలీవుడ్ లో మాత్రం సినిమా లు మంచి వసూళ్లను దక్కించుకుంటున్నాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గడచిన మూడు వారాలుగా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి ఈ వారం పెద్ద సినిమాలు లేక పోవడంతో గత వారంలో విడుదల అయిన సినిమా లనే మళ్లీ ప్రేక్షకులు చూడాల్సి రావచ్చు.
అయితే సీతారామం మరియు బింబిసార సినిమాలకు కలిసి వచ్చే విషయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాక్సాఫీస్ వర్గాల వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కార్తికేయ 2 సినిమా భారీ గా వసూళ్లను దక్కించుకోబోతుంది.
మరో వైపు బింబిసార మరియు సీతారామం సినిమా కూడా ఈ వారం కుమ్మేయడం ఖాయం అంటున్నారు.ఈ వారంలో పెద్ద సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద సందడి ఉండదేమో అని కొందరు అనుకుంటున్నారు.
కాని ఆ మూడు సినిమాల జోరు తగ్గని కారణంగా కచ్చితంగా ఆ మూడు సినిమాలు తెగ హడావుడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారీ ఎత్తున అంచనాలున్న బాక్సాఫీస్ వేట వచ్చే వారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఈ వారం బాక్సాఫీస్ వద్ద కార్తికేయ 2 డామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.వరుసగా రెండవ వారం కూడా ఆ సినిమా కుమ్మేయడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు బింబిసార మరియు సీతారామం సినిమా లు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడవ వారం కూడా సందడి చేయబోతున్నాయి. ఈ వారం విడుదల అవ్వబోతున్న సినిమాల గురించి కనీసం పరిచయం కూడా లేదు.
కనుక ఆ సినిమాలను జనాలు ఎంత వరకు చూస్తారు అనేది అనుమానమే.ఆ సినిమాలకు టాక్ పాజిటివ్ వచ్చి.
హిట్ టాక్ వచ్చినా కూడా కార్తికేయ 2 ను మించి ఆ సినిమాను చూస్తారని భావించడం లేదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.