సీతారామం హిట్‌తో రష్మిక కు దక్కింది ఏంటో తెలుసా..!

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా సీతారామం సినిమా లో ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే.ఒక స్టార్‌ హీరోయిన్ ఇలా కీలక పాత్రలో నటించడం ఏంటో అంటూ సీతారామం విడుదలకు ముందు అంతా ముక్కున వేలేసుకున్నారు.

 Sitaramam Movie Rashmika Mandana News , Film News, News In Telugu, Pushpa 2, Ra-TeluguStop.com

రష్మిక అందాల ఆరబోత లేదు… ముద్దుగుమ్మ ఐటెం సాంగ్‌ లో చేస్తున్నది లేదు.ఫుల్ ప్యాక్‌ డ్రెస్ లో ఈ అమ్మడు కనిపించింది.

అయినా కూడా సీతారామం లో రష్మిక మందన్నా పాత్ర కు మంచి మార్కులు పడ్డాయి.పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కించుకుంటుంది.

హీరోయిన్ గా ఎన్నో కమర్షియల్‌ పాత్రలు చేస్తారు.కాని ఏ ఒక్కటి కూడా వారికి సంతృప్తిని ఇవ్వక పోవచ్చు.

కాని ఇలాంటి పాత్రలు చేయడం వల్ల కమర్షియల్ గా ఎంత లాభం ఉంటుందో కాని మంచి సంతృప్తి మాత్రం దక్కుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో రష్మిక మందన్నా గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు.

రష్మిక మందన్నా టాలీవుడ్ లో కమర్షియల్‌ గా ఎంతటి ప్రాముఖ్యతను దక్కించుకుందో తెల్సిందే.ఆమెకు శ్రీవల్లి సినిమా స్టార్‌ డమ్‌ ను తీసుకు రావడంతో పాటు పాన్‌ ఇండియా స్టార్‌ డమ్ ను తెచ్చి పెట్టింది.

అయితే సీతారామం సినిమా మాత్రం అలాంటి కమర్షియల్‌ క్వాలిటీస్ ను కలిగి లేదు.కాని నటిగా కెరీర్‌ మొత్తం కూడా గుర్తు ఉంచుకునే విధంగా రష్మిక కు ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అంటున్నారు.

సినిమా లో రష్మిక పాత్ర ను ప్రతి ఒక్కరు కూడా ఓన్‌ చేసుకున్నారు.కథను ఆమెతో పాటు ఫీల్‌ అవుతూ అనుభూతి చెందుతున్నారు.అందుకే సీతారామం సినిమా తో రష్మిక కు సంతృప్తి దక్కింది అనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube