కేకే శైలజకు మంత్రి పదవి దక్కకపోవడం పై స్పందించిన సీతారాం ఏచూరి.. !

కేరళ మాజీ మంత్రి కేకే శైలజ కరోనా ఫస్ట్ వేవ్ లో అద్భుతంగా పనిచేసి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.కానీ రెండో సారి మంత్రి వర్గంలో కేకే శైలజకు చోటు లభించ లేదు.

 Sitaram Yechury Responds To Kk Shailaja Not Getting The Post Of Minister Sitaram-TeluguStop.com

దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు మొదలు అయ్యాయి.

అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ఉద్యమం ఊపందుకుంటుంది.

శైలజకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.అయితే నిన్న రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేస్తున్న కార్యక్రమానికి సీతారాం ఏచూరి హాజరైన సందర్భంగా శైలజకు మంత్రి పదవి దక్కకపోవడం పై వివరణ ఇచ్చారు.

రాజకీయాల్లో కొత్తవారికి అవకాశాలు కల్పించడం వల్ల రాష్ట్ర అభివృద్ది కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతుందని, ఇక పార్టీ కూడా బలోపేతం కావడానికి ముఖ్యకారణంగా ఈ నిర్ణయం నిలుస్తుందని అందువల్ల ఈ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కేబినెట్‌లోకి కొత్త వారిని తీసుకున్నట్టు చెప్పారు.ఇకపోతే ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి.

ఎవరిని మంత్రిగా తీసుకోవాలి.అనేది పూర్తిగా ఆయా రాష్ట్రాల కమిటీలు నిర్ణయిస్తాయని, అన్ని రాష్ట్రాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని వెల్లడించారు.

మరి సీతారాం ఏచూరి వివరణతో సోషల్ మీడియాలో ఉద్యమం ఆగిపోతుందా లేదా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube