సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ నుండి సినిమా అనగానే తెలుగు ప్రేక్షకులు పాజిటివ్ దృష్టితో చూస్తున్నారు.త్రివిక్రమ్ హ్యాండ్ ఉండటంతో పాటు విభిన్నమైన కథను ఎంపిక చేస్తారని.
అలాగే కథ మరియు కథనం విషయంలో త్రివిక్రమ్ యొక్క ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని అంతా భావిస్తూ ఉంటారు.ఇప్పటి వరకు వచ్చిన సితార వారి సినిమాలు చాలా వరకు విజయాలను సొంతం చేసుకున్నాయి.
కనుక సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో సినిమా అనగానే చాలా మంది మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం తో ఉన్నారు.అలాంటి బ్యానర్ నుండి బుట్టబొమ్మ సినిమా రాబోతుంది.
అనిక సురేంద్రన్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది.అర్జున్ దాస్ హీరోగా కనిపించబోతున్నాడు.
శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను నాగ వంశీ నిర్మించాడు.మలయాళ సూపర్ హిట్ మూవీ కప్పెల కి ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.

ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు ఇతర పబ్లిసిటీ వీడియోస్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.హీరోయిన్ గా అనిక సురేంద్రన్ కు ఇదే మొదటి సినిమా.గతంలో ఈమె పలు సినిమా ల్లో నటించి మెప్పించింది.హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు పలు సినిమాల్లో బాల నటిగా నటించింది.ఆ మధ్య నాగార్జున ది ఘోస్ట్ సినిమా లో కూడా ఈమె నటించిన విషయం తెల్సిందే.తెలుగు లో ఈ అమ్మడు హీరోయిన్ గా కచ్చితంగా మంచి ఎంట్రీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇది ఒక చిన్న సినిమా.రీమేక్ సినిమా అయినా కూడా ప్రముఖులతో ప్రమోషన్ చేయించిన సితార వారు భారీ పబ్లిసిటీని దక్కించుకున్నారు.కచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అన్నట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.సినిమాను రూపొందించడం మాత్రమే కాకుండా ఇలా మంచి పబ్లిసిటీ చేయాలని సితార వారిని చూసి నేర్చుకోవాల్సిందే.