దిశ హత్య కేసు విచారణకు సిట్ ఏర్పాటు

దిశ హత్య కేసు విచారణను పోలీసుల వేగవంతం చేశారు.ఇప్పటికే నిందితులను పోలీసులు వారం రోజుల కస్టడీకి తీసుకున్నారు.

 Sit Priyanka Disha On Sit-TeluguStop.com

విచారణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీని నియమించారు.

నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులు ఇందులో ఉన్నారు.కేసు విచారణ, ఆధారాల సేకరణపై ముమ్మర దర్యాప్తు జరిపేలా కమిటీని ఏర్పాటు చేశారు.

కేసులో సైంటిఫిక్ ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదికలు తెప్పించడంపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.

అదేవిధంగా దిశ హత్య కేసులో పోలీసులు మొత్తం ఏడు బృందాలను ఏర్పాటు చేశారు.

ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులు ఉండనున్నారు.ఈ ఏడు బృందాలు ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ దాఖలు వరకు పనిచేయనున్నాయి.

నిందితుల విచారణకు డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందం విచారణ చేయగా.సాక్ష్యాల సేకరణకు మరో బృందం విచారించనుంది.

ఫోరెన్సిక్, డీఎన్‌ఏల పరిశీలనకు మరో బృందం, లీగల్ ప్రోసిడింగ్స్‌కు ఇంకో బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Telugu Disha, Telugu Ups-

ఈ కేసులో ప్రధానంగా ఉన్న ప్రత్యక్ష సాక్షుల విచారణ ఐడెంటిఫికేషన్ పిరియడ్ కోసం మరొక టీమ్ ఏర్పాటు చేశారు.ఈ కేసులో సీసీ కెమెరాల వీడియో అనాలసిస్, టెక్నీకల్ ఏవిడెన్స్ ఎనాలిసిస్ కోసం మరో బృందాన్ని, సీన్ టూ సీన్ అనాలసిస్, క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం మరో బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.కాగా నెల రోజుల్లో చార్జ్ ‌షీట్ దాఖలు చేయాలని సీపీ సజ్జనార్ కింది సిబ్బందిని ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube