చిరంజీవి సినిమాలకి పెద్ద సమస్యగా మారిన చెల్లెలు పాత్రలు !

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 Sister Roles Are Problem For Megastar Chiranjeevi Remake Movies, Chiranjeevi, Ac-TeluguStop.com

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న ఆచార్య సినిమా తర్వాత వరుస సినిమాలను చిరు లైన్లో పెట్టాడు.

ఇప్పటికే రెండు రీమేక్ సినిమాలను చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.

ఈ సినిమా ముగిసిన వెంటనే చిరు లూసిఫర్ సినిమా ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేయబోతున్నాడు.అయితే ఈ సినిమాతో పాటు చిరు వేదాళం రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక్కడ వరకు బాగానే ఉన్న ఈ రెండు సినిమాలకు చిరంజీవికి ఒకే సమస్య ఎదురైంది.

అది ఏంటంటే.

ఈ రెండు సినిమాల్లో చిరంజీవికి చెల్లెలు పాత్రలు అవసరం.ఇప్పటికే లూసిఫర్ షూటింగ్ మొదలయ్యింది ఇప్పటి వరకు కీలక పాత్ర అయినా చెల్లెలి రోల్ లో ఎవరిని తీసుకుంటున్నారో తెలియలేదు.

Telugu Acharya, Chiranjeevi, Keerthy Suresh, Lucifer, Manjusha, Mohanla, Nayanth

లూసిఫర్ లో మోహన్ లాల్ కు చెల్లెలి పాత్రలో మంజు వారియర్ నటించింది.వీరిద్దరి నటన ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది.అంత కీలక మైన పాత్రలో చిరు కు చెల్లెలిగా ఎవరిని తీసుకోవాలో అని డైరెక్టర్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడట.

Telugu Acharya, Chiranjeevi, Keerthy Suresh, Lucifer, Manjusha, Mohanla, Nayanth

ఈ సినిమాలోనే కాదు వేదాళం సినిమాలో కూడా చెల్లెలి పాత్ర కీలకమైనది.వీరిద్దరి బంధం మీదనే ఈ సినిమా మొత్తం సాగుతుందట.ఇప్పటికే వేదాళం లో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నట్టు ఆమె ఒప్పుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు నయనతార పేరు కూడా వినిపిస్తుంది.కానీ మొన్నటి వరకు హీరోయిన్ గా చేసి ఇప్పుడు మళ్ళీ చెల్లెలి పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులకు రక్తి కట్టేలా ఉండదని కూడా వార్తలు వస్తున్నాయి.

అందుకే చిరు చెల్లెలి పాత్రల కోసం డైరెక్టర్లు తీవ్రంగా వెతుకుతున్నారని తెలుస్తుంది.అందుకే ఇప్పుడు చిరంజీవి చెల్లెలి పాత్ర ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా చర్చిస్తున్నారు.

మరి వీరికి ఎప్పటికి దొరుకుంటుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube