భర్తను జైలు  విడిపించుకోవాలని ఓ అక్క ఏకంగా సొంత తమ్ముడిపైనే…  

Sister Murder Attempt On His Younger For Money And Property - Telugu Bangalore, Crime News, Karnataka, Murder Attempt, Sister Murder Attempt On His Brother

ప్రస్తుత కాలంలో కొందరు బంధాల మీద వ్యామోహంతో చివరికి తమ తోడబుట్టిన వారిని సైతం కడతేర్చే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా ఓ మహిళ తన భర్తను జైలు నుంచి విడిపించుకోవడం కోసం డబ్బులు అవసరం కాగా ఏకంగా ఆమె తమ్ముడిని చంపి ఆస్తి కాజేయాలని చూసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 Sister Murder Attempt On His Younger For Money And Property

వివరాల్లోకి వెళితే సుమలత అనే వివాహిత కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.అయితే ఈ మధ్య ఈమె భర్త పలు నేర ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

దీంతో ఎలాగైనా సుమలత జైలులో ఉన్న తన భర్తను విడిపించుకోవాలని ప్రయత్నాలు చేసింది.అయితే ఇందుకు గాను లాయర్ ఫీజులు మరియు పూచీ కత్తుకి కొంత నగదు అవసరం అయింది.

భర్తను జైలు  విడిపించుకోవాలని ఓ అక్క ఏకంగా సొంత తమ్ముడిపైనే…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో తన సోదరుడు మరియు తన పేరుపై ఉన్నటువంటి ఆస్తిని అమ్మేసి తన భర్తను బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేసింది.ఈ క్రమంలో ఆమె సోదరుడు తన ఆస్తిని విక్రయించేందుకు నిరాకరించాడు.

దీంతో తన భర్తపై ఉన్నటువంటి తీవ్ర వ్యామోహంతో తన సోదరుడిని సైతం హత్య చేసేందుకు పథకం పన్నింది.

పథకంలో భాగంగా డబ్బు కోసం హత్య చేసేటువంటి కిరాయి ముఠా ను సంప్రదించి వారితో ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే ముందుగా పథకంలో భాగంగా సుమలత సోదరుడిపై కిరాయి ముఠా హత్యాయత్నం చేశారు.అయితే ఈ క్రమంలో ఆమె సోదరుడు చనిపోయాడనుకుని అక్కడే వదిలి పెట్టి వెళ్లిపోయారు.

అయితే ఎలాగోలా అతి కష్టం మీద ప్రాణాలు దక్కించుకున్నటువంటి ఆమె సోదరుడు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను తనపై జరిగినటువంటి హత్యాయత్నం గురించి పోలీసులకు వివరించాడు.దీంతో వెంటనే అప్రమత్తమై నటువంటి పోలీసులు సుమలతను అదుపులోకి తీసుకొని జైలుకి తరలించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sister Murder Attempt On His Younger For Money And Property Related Telugu News,Photos/Pics,Images..

footer-test