సినిమా అనే రంగుల ప్రపంచంలోకి రావాలని ఎంతో మంది భావిస్తారు.సినిమాల్లోకి వచ్చి మంచి స్టార్ గా ఎదగాలని కలలు కంటారు.
అయితే అందరూ అనుకున్నంత ఈజీగా సినిమా అవకాశాలు రావు.ఒకవేళ వచ్చినా అంత తర్వరగా నిలబడవు.
అయితే కొందరు ఓవర్ నైట్ స్టార్లుగా మారిన వాళ్లు ఉన్నారు.మరికొందరు రాత్రికే రాత్రే ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిన వాళ్లూ ఉన్నారు.
మరికొందరు ఉన్నామా? అంటే ఉన్నాం అన్నట్లు నటించే వారూ ఉన్నారు.ఇంకొందరు సినిమా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్స్ అయిన వారు ఉన్నారు.
కొందరు వివిధ విభాగాల్లో పనిచేసి సక్సెస్ అయిన వాళ్లు ఉన్నారు.కొందరు మంచి బ్యాగ్రౌండ్ ఉన్నా నిలదొక్కుకోలేని వారున్నారు.
ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సిరివెన్నెల సినిమా పాటలతో గీత రచయితగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన.అద్భుత పాటలతో తన తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు.సీతారామ శాస్త్రి ఎన్నో అద్భుత పాటలు రాసి అందరి చేత ప్రశంసలు పొందాడు.
తన చక్కటి సాహిత్యంతో ఎవర్ గ్రీన్ సాంగ్స్ కు ప్రాణం పోశాడు.అంతేకాదు.
పలు సినిమాల్లో కొన్ని పాత్రలు పోషించాడు కూడా.అనంతరం ఆయన కొడుకు కూడా సినిమాల్లోకి అడుగు పెట్టాడు.
మంచి నటుడిగా రాణిస్తున్నాడు.ఇంతకీ తన కొడుకు ఎవరు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
సిరివెన్నెల కొడుకు మరెవరో కాదు రాజా చేంబోలు.నిజానికి ఈయనను చూస్తే సీతారామ శాస్త్రి కొడుకు అని ఎవరూ అనుకోరు.ఆయన పలు నెగెటివ్ రోల్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
తండ్రి పేరు వాడుకోకుండా తన టాలెంట్ తో సినిమా పరిశ్రమలో రాణిస్తున్నాడు.ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ చేసిన ఆయన.ఎవడు మూవీలో రామ్ చరణ్ ఫ్రెండ్ గా నటించాడు.ఏబీసీడీ మూవీలో రాజకీయ నాయకుడిగా చేశాడు.
అటు మిస్టర్ మజ్ను, అంతరిక్షం, ఇద్దరిలోకం ఒక్కటే, అజ్ఞాతవాసి సహా పలు సినిమాల్లో నటించాడు.ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు.