సీతారామ‌శాస్త్రి చేతిరాత‌ ఎపుడైన చూశారా?

సిరివెన్నెల మరణం సినీ జనాలనే కాదు.సంగీత ప్రియులను కూడా దుఃఖ  సాగరంలో ముంచి వేసింది.

 Siri Vennela Sitharama Shastry Hand Writing Details, Sirivenenla Seetharama Sast-TeluguStop.com

అసమానా గేయ రచయిత అయిన సిరివెన్నెల కలం నుంచి వేల పాటలు అలా జాలువారాయి.ఉన్నత స్థాయి సాహిత్య విలువలతో కూడా పాటలు రాసేవాడు సిరివెన్నెల.

ఆయన రాసిన ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు.ఆయన గేయ రచయితగా మారడం తెలుగు జనాల అద్రుష్టంగా చెప్పుకోవచ్చు.

ఆయన నుంచి వచ్చిన అనేక పాటలు అత్యంత పదును కలిగి ఉండేవి.అలా రాసిన పాటల్లో గాయం సినిమాలోని అర్థ శతాబ్దపు అనే పాట ఎంతో పేరు పొందింది.

తాజాగా కూడా అలాంటి పాటలు ఆయన నుంచి వచ్చాయి.

కొంత కాలం క్రితం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కంచె.

ఈ సినిమాలో ఆయన రాసిన పాటలు అద్భుతం అని చెప్పుకోవచ్చు.ప్రధానంగా విద్వేషం పాలించే దేశం ఉంటుందా? అంటూ ఆయన పదునైన పాటను లిఖించాడు.ఈ పాట వరుణ్ తేజ్ మీద చిత్రీకరించాడు క్రిష్.రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా మనుషుల మధ్య, దేశాల మధ్య ఉండాల్సింది ద్వేషం కాదు.

ప్రేమ అంటూ అద్భుత రీతిలో తన పాటను ముందుకు తీసుకెళ్లాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటలోని భావ వ్యక్తీకరణకు అందరూ ముగ్దులయ్యారు.

Telugu Krish, Kanche, Lungs Cancer, Siri Vennela, Sirivennela, Tollywood-Movie

చిరంతన్ భట్ బాణీల తర్వాత ఎవరు పాట రాస్తే బాగుంటుందని చర్చ నడిచింది.అప్పుడు క్రిష్ మదిలో మెదిలిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి.వెళ్లి ఆయనకు సందర్భాన్ని వివరించాడు క్రిష్.వెంటనే తన కలానికి పని చెప్పాడు.విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వ‌ర్గం ఉంటుందా? అంటు పదునైన పదాలతో పల్లవిని రాశాడు.

ఆ తర్వాత ప్రేమ‌ను మించిందా బ్ర‌హ్మాస్త్ర‌మైనా.

ఆయువుపోస్తుందా ఆయుధ‌మేదైనా అంటూ మొదటి చరణం.అంద‌రికీ సొంతం అందాల లోకం.

కొంద‌రికే ఉందా పొందే అధికారం అంటూ మరో చరణం కంప్లీట్ చేశాడు.సీతారామ శాస్త్రి రాసిన అద్భుత పాటల్లో ఈ పాట కూడా మంచి పేరు సంపాదించుకుంది.

ఈ పాటను స్వయంగా ఆయన దస్తూరీతో రాయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube