సిరివెన్నెల రాసిన చివరి సినిమా పాటలేంటో తెలుసా?

అద్భుత పద ప్రయోగంతో చక్కటి పాటలను అల్లిన గేయ రచయిత.సిరివెన్నెల సీతారామ శాస్త్రి కాసేపటిక్రితం అస్తమించాడు.

 Siri Vennela Seetharama Sastry Last 2 Songs Details, Sirivennela Seetha Rama Sas-TeluguStop.com

గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.ఇవాళ సాయంత్రం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.వేల పాటలు రాసిన పాటల పూరేడు.సినీ వినీలాకాశంలోకి వెళ్లిపోయాడు.తన పదాలతో తెలుగు సాహిత్యానికి సరికొత్త మెరుగుల్ని అద్దాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన అద్భుత సాహిత్యానికి పదుల సంఖ్యలో అవార్డులు వచ్చాయి.

ఎన్నో పురస్కారాలు ఆయన సెల్ఫ్ లో చేరిపోయాయి.సినీ కళామ తల్లికి ఆయన చేసిన సేవకు గాను భారతీయ ఉన్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ ఆయనను వరించింది.

తన కెరీర్ లో ఎన్నో అద్భుత పాటలు రాసిన సిరివెన్నెల చివరి సారిగా నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాకు పాటలు రాశాడు.ఈ సినిమాలో తన కలం నుంచి జాలు వారిన రెండు పాటలు పెట్టారు.

అవే తన జీవితంలో రాసిన చివరి పాటలు.ఆయన అకాల మరణం పట్ల శ్యామ్ సింగ రాయ్ సినిమా యూనిట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అని వెల్లడించింది.ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించింది.

Telugu Nani, Siri Vennela, Sirivennela-Movie

సిరివెన్నెల సీతారామ శాస్త్రి.మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యంలో మార్పులు చేసుకుంటూ వచ్చాడు.ఎంతో అద్భుత పద బంధాలను వాడిన ఆయనే రాను రాను.లేటెస్ట్ సినిమాలకు అనుగుణంగా తన సాహిత్యాన్ని పదిల పర్చాడు.తన సాహిత్యంతో తానే పోటీ పడి మరీ ముందుకుసాగాడు.

Telugu Nani, Siri Vennela, Sirivennela-Movie

తెలుగు సినిమాలతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి సుపరిచితం.ఆయన పాటలు మనలను ఎప్పుడూ తడుముతూనే ఉంటాయి.ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోయినా.

తన పాటలు ఎప్పుడూ మన వీణుల విందు చేస్తూనే ఉంటాయి.తెలుగు సినిమా పాటల్లో ఆయన రాసిన పాటలు ఎప్పుడూ గొప్పగానే వెలుగొందుతూనే ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube