ప్రియుడితో డేటింగ్ పై పచ్చి పచ్చిగా మాట్లాడిన సిరి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్?

ప్రస్తుతం బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రసారమవుతూ ముగింపు దశకు కూడా దగ్గరలో ఉంది.ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Siri Talking About Dating With Boy Friend Video Viral,  Bigg Boss 5, Telugu, Sir-TeluguStop.com

మొదటి రెండు వారాల్లోనే తమ పరిచయాలు పూర్తిగా పెంచుకొని తమ నిజ స్వరూపాలను కూడా బయటపెట్టారు.ప్రతి సీజన్ లాగా ఈ సీజన్ లో ఓ కంటెస్టెంట్ క్యారెక్టర్ మొత్తం బయటపడటంతో బాగా వ్యతిరేకతను అందుకుంటుంది.

ఇంతకు ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు సిరి హన్మంత్. ఈమె షో ప్రారంభం నుంచి అందరి దృష్టిలో పడింది.ఎక్కువగా షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉంటూ అందరి నుండి విమర్శలు ఎదుర్కొంటుంది.ఈమధ్య షణ్ముఖ్ తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

పైగా షణ్ముఖ్ కూడా సిరితో బాగా క్లోజ్ అవుతున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా సిరికి సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

గతంలో సిరి తన మొదటి బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి బాగా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత మరో బుల్లితెర నటుడు శ్రీహాన్ తో లవ్ లో పడింది.

ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను బాగా పంచుకుంటుంటారు.

ఆ మధ్య బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ సిరి కి లెటర్ ద్వారా పెళ్లి చేసుకుంటానని చెప్పగా సిరి బాగా సంతోష పడింది.కానీ సిరి ఇప్పుడు షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండటంతో పరిస్థితులు మొత్తం మారుతున్నట్లు కనిపిస్తుంది.ఇదంతా పక్కన పెడితే గతంలో శ్రీహాన్ సిరి ని ఇంటర్వ్యూ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

అందులో ఇద్దరు తమ డబల్ మీనింగ్ మాటలతో బాగా రెచ్చిపోయారు.ఇందులో సిరి సమాధానం తప్పు చెబితే తనకు ముద్దు పెట్టాలి అని కోరాడు శ్రీహన్.దొరికిందే చాన్స్ అంటూ సిరి కూడా ముద్దులతో రెచ్చిపోయింది.ఇక శ్రీహాన్ తమ ఫస్ట్ మీట్ ఎక్కడ అని సిరి అడగటంతో షార్ట్ ఫిలిం ప్రీమియర్ లో కలిశాము అని తెలిపింది.

ఇక మన ఫస్ట్ కిస్ ఎప్పుడు అని మరో ప్రశ్న వేయగా తనకు సరిగ్గా గుర్తు లేదని చెప్పింది సిరి.

వెంటనే తమ ఫస్ట్ కిస్ గురించి శ్రీహాన్ చెప్పటంతో వెంటనే అతడికి ముద్దు పెట్టింది సిరి.ఇక డేటింగ్ గురించి ప్రశ్నించడంతో.అరేయ్ నువ్ ఎవడ్రా నన్ను డేట్ కి తీసుకొని వెళ్ళింది.

ఎన్నిసార్లు అడిగినా తీసుకొని వెళ్లరా అని తీసుకుని వెళ్ళావా? గోవా తీసుకుని వెళ్ళమని ఎప్పటి నుంచో అడుగుతున్నా కూడా ఇప్పటివరకు తీసుకెళ్లలేదు అంటూ సిరి అనటంతో మనం చాలా చోట్ల కి వెళ్ళాం కానీ నీకు గుర్తుకు లేదులే అని శ్రీహాన్ సమాధానమిచ్చాడు.ఇక వీరి మధ్య జరిగిన బోల్డ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube