పాన్ షాప్ పెట్టి చదివించాను.. ఎన్నో మాటలు పడ్డాను అంటూ సిరి తల్లి కన్నీళ్లు?

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం కంటెస్టెంట్ లో ఫ్యామిలీ రాకతో బిగ్ బాస్ ఇల్లంతా సందడిగా మారిపోయింది.ఈ క్రమంలోనే పలువురు కంటెస్టెంట్ లు తమ కుటుంబ సభ్యులను చూసి ఎమోషనల్ కూడా అయ్యారు.

 Bigg Boss Contestant Siri Mother Personal Life Struggles, Bigg Boss Contestant S-TeluguStop.com

నిన్నటి ఎపిసోడ్ లో కాజల్ కు సంబంధించి తన భర్త కూతురు ఎంట్రీ ఇవ్వడం తో కాజల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అనంతరం మానస్ తల్లి, సన్నీ తల్లీ ఎంట్రీ ఇచ్చారు.

మానస్ మదర్ అందరితో జాలిగా కలిసిపోయింది.ఈ క్రమంలోనే సిరి, షణ్ముఖ్ ల హగ్గు లపై కౌంటర్లు వేసింది.అనంతరం కాజల్, రవి పై సెటైర్ వేసింది.ఆ తర్వాత కంటెస్టెంట్ సిరి తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

సిరి గురించి తల్లి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.అనంతరం సిరి, షణ్ముఖ జస్వంత్ ఇచ్చుకునే హగ్గులు, ముద్దులు తనకు నచ్చలేదంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

సిరి అలా చేయడం తనకు నచ్చలేదని సిరి తల్లి ముఖం మీద చెప్పేసింది.అనంతరం సిరి మదర్ తాను పడ్డ కష్టాలు గురించి చెప్పింది.సిరి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు.ఆ తర్వాత పాన్ షాప్ పెట్టి చదివించాను. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు అంటూ ఎమోషనల్ అయ్యింది.అనంతరం ఎన్నో కష్టాల తర్వాత ఇక్కడ వరకు వచ్చింది నాకు గర్వంగా ఉంది ఇప్పుడు అందరూ సిరి వాళ్ళ అమ్మ అని అంటున్నారు అంటూ గర్వంగా చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube