త్వరలో స్టార్ట్ అవబోతున్న బిగ్ బాస్ సీజన్ 5లో హౌజ్ మేట్స్ ను సెలెక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు.సీజన్ 5లో ఇప్పటికే స్టార్ సెలబ్రిటీస్ ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది.
హైపర్ ఆది, టిక్ టాక్ దుర్గారావు, వర్షిణి, షణ్ముఖ్ ఇలా బిగ్ బాస్ సీజన్ 5 లో ఉంటున్న వారి కొందరి లిస్ట్ ఒకటి చెక్కర్లు కొడుతుంది.వీరిలో సీరియల్ యాక్ట్రెస్ సిరి హన్మత్ కూడా ఉందని టాక్.
మొదట్లో యాంకర్ గా మెప్పించిన సిరి ఆ తర్వాత సీరియల్ లో నటిస్తూ మెప్పించింది.ఈమధ్య సీరియల్స్ తో పాటుగా రియాలిటీ షోస్ తో కూడా అలరిస్తుంది అమ్మడు.
సిరి హన్మత్ బిగ్ బాస్ కు వస్తుందని లేటెస్ట్ టాక్.బిగ్ బాస్ కు వెళ్తే ఉన్న క్రేజ్ డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది.షోలో ఉన్నంతవరకు ఆడియెన్స్ ఫోకస్ వారి మీదే ఉంటుంది.అందుకే బిగ్ బాస్ ఛాన్స్ అనగానే బుల్లితెర భామలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఈ క్రమంలో సిరికి బిగ్ బాస్ ఛాన్స్ అందుకుందని టాక్.మరి నిజంగానే బిగ్ బాస్ సీజన్ 5లో సిరి ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.
ఆగష్టు నుండి బిగ్ బాస్ సీజన్ 5 మొదలవుతుందని తెలుస్తుంది.