బిగ్ బాస్ హౌస్‌లోకి రియల్ ప్రేమజంట.. రొమాంటిక్ జోడికి ఆఫర్?

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి అందరికీ తెలిసిందే.ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు తమ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు బాగా ఆసక్తిగా చూస్తుంటారు.

 Siri Hanmanth And Sriharan Couple In Telugu Bigg Boss 5 Contestants,  Siri Hanum-TeluguStop.com

ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తిచేసుకున్న ఈ షో త్వరలోనే ఐదవ సీజన్ కి సిద్ధం కానుంది.ఇక ఇప్పటి వరకు ముగిసిన సీజన్ లలో ఇందులోకి వచ్చినా వాళ్ళు లవ్ బర్డ్స్ గా మారారు.

వరుణ్ సందేశ్, వితిక లు దంపతులుగా వచ్చారు.ఇక తాజాగా రియల్ ప్రేమ జంట సీజన్ ఫైవ్ కి ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఇంతకీ వాళ్ళేవరంటే.

బుల్లితెర సెలబ్రిటీలు సిరి హనుమంతు, శ్రీహాన్.

యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన సిరి ఉయ్యాల జంపాల సీరియల్ తో బుల్లి తెరకు పరిచయమైంది.అంతేకాకుండా మోహిని, అగ్నిసాక్షి సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈమె మరో నటుడు శ్రీ హాన్ ను ప్రేమిస్తుంది.త్వరలోనే వీరిద్దరు జంట కానున్నారు.

అంతేకాకుండా వీరిద్దరు కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు.

Telugu Bigg Boss, Romanticpair, Serial Stars, Shrihan, Siri Hanumanth, Tollywood

సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్ళు సిరీస్ లో నటించగా ఈ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నారు.అంతేకాకుండా రామ్ లీలా అనే వెబ్ సిరీస్ కూడా వీరికి మంచి క్రేజ్ ను అందించింది.ఇక పలు బుల్లితెర షో లలో కూడా వీళ్లు జంటగా పాల్గొన్నారు.

గతంలో స్టార్ మా లో 100% లవ్ అనే షో లో ఇందులో వీరికి స్టార్ మా నిశ్చితార్థ వేడుకలు కూడా జరిపించన సంగతి తెలిసిందే.ఇటీవల సుమ హోస్టింగ్ చేస్తున్న స్టార్ మ్యూజిక్ షో కూడా ఈ జంట పాల్గొని బాగా సందడి చేశారు.

ఇక ఈ జంట బిగ్ బాస్ 5 లో కూడా అవకాశాన్ని అందుకోగా.అది కూడా పెళ్లికి ముందే ప్రేమ జంటగా వెళ్లనున్నారు.ఇక ఇందులో వీళ్ళ మధ్య ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube