ఏపీలోని ఆ థియేటర్లలో టికెట్ ధర 5 రూపాయలే.. టీ ధర కంటే తక్కువంటూ?

తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయి థియేటర్లలో అఖండ మూవీ విడుదలైంది.ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

 Single Tea On Movie Ticket Price Ap Government Details, Five Rupees, Grama Panch-TeluguStop.com

ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చే విధంగా అఖండ మూవీ ఉందని కామెంట్లు వస్తున్నాయి.అయితే టాక్ పాజిటివ్ గా ఉన్నా ఏపీలో కలెక్షన్ల విషయంలో అఖండ డిస్ట్రిబ్యూటర్లను నిరాశపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

ఏపీలోని కొన్ని థియేటర్లలో టికెట్ ధర కేవలం 5 రూపాయలుగా ఉంది.

గ్రామ పంచాయితీలలో నాన్ ఏసీలలో ఎకానమీ టికెట్ ధర 5 రూపాయలుగా ఉండటం గమనార్హం.

గ్రామ పంచాయితీలలో ఏసీ థియేటర్ కు టికెట్ రేటు పది రూపాయలుగా ఉంది.ఈ టికెట్ రేట్లు సింగిల్ టీ, కాఫీ రేట్ల కంటే తక్కువగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏపీలో 1200 థియేటర్లు ఉండగా ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు బ్రేకులు వేయడంతో పాటు థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలకు మించి ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో టికెట్ రేట్లను తగ్గించడం వల్ల అఖండ నిర్మాతకు రిలీజ్ కు ముందే 5 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్టు సమాచారం.

Telugu Rupees, Akhanda, Ap, Ap Theaters, Ap Ticket, Bheemla Nayak, Ticket, Produ

అఖండ తర్వాత పుష్ప, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ , భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కానుండగా ఈ సినిమాలపై ఏపీ టికెట్ రేట్ల వల్ల భారీగా ప్రభావం పడనుంది.నిర్మాతలు, ఎగ్జిబిటర్లు టికెట్ రేట్లను పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతుండగా ఏపీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని పరిశీలిస్తోంది.

Telugu Rupees, Akhanda, Ap, Ap Theaters, Ap Ticket, Bheemla Nayak, Ticket, Produ

ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచకపోతే మాత్రం భవిష్యత్తులో సినిమాల బడ్జెట్లు భారీగా తగ్గే అవకాశం ఉంది.సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొంతమేర టికెట్ రేట్లను పెంచితే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై టికెట్ రేట్ల ప్రభావం ఎక్కువగా పడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube