90 ఏళ్ల వయసులోనూ ఇంకా పరితపిస్తూనే ఉన్నాడు  

Singeetam Srinivasa Rao, Singeetam Srinivasa Rao Ready to make film,90 Years age - Telugu 90 Years Age, Singeetam Srinivasa Rao, Singeetam Srinivasa Rao Ready To Make Film

సినిమా ప్రపంచం ఇప్పుడు గ్రాఫిక్స్‌ కారణంగా మరింత రంగులమయం అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఎలాంటి గ్రాఫిక్స్‌ లేని సమయంలోనే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన అద్బుతాలు అన్ని ఇన్నీ కావు.

 Singitham Srinivasrao Ready To Make Film

పుష్పక విమానం నుండి మొదలుకు ఆధిత్య 369 వరకు ఎన్నో అద్బుతాలను ఆయన ఆవిష్కరించారు.అసలు ఇలాంటి సినిమాలు ఎలా చేసి ఉంటారు అప్పట్లోనే అన్నట్లుగా ఆయన సినిమాలు ఉంటాయి.

ఆయన వాడిన కొన్ని టెక్నిక్స్‌కు హాలీవుడ్‌ వారు కూడా అవాకయ్యే వారట.

90 ఏళ్ల వయసులోనూ ఇంకా పరితపిస్తూనే ఉన్నాడు-Movie-Telugu Tollywood Photo Image

చేసినవి తక్కువ సినిమాలే అయినా శతాధిక చిత్రాల దర్శకుల కంటే కూడా ఎక్కువ పేరు దక్కించుకున్నాడు.

ప్రస్తుతం సింగీతం వారి వయసు 90 ఏళ్లు.ఈ వయసులో కూడా ఆయన కొత్త సినిమా కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడట.

ఈ విషయం ఆయన సన్నిహితులు ప్రకటించారు.సింగీతం వారు రెండేళ్ల క్రితం బాలయ్యతో ఆధిత్య 369 కు సీక్వెల్‌ చేయాలనుకున్నాడు.

స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసే సమయంలో అది కాస్త పక్కకు వెళ్లింది.ప్రస్తుతం మరో స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు.

ఈ కరోనా సమయంలో ఏ ఒక్క సినిమా కూడా షూటింగ్‌ జరగడం లేదు.సింగీతం వారి సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్‌ నుండి పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

ఈ వయసులో దర్శకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు.ఆ ఒత్తిడి ఆయన తట్టుకుంటాడా అనేది చూడాలి.

ఇక ఆయన క్రియేటివిటీ ఈ తరం ప్రేక్షకులకు ఎలా ఎక్కుతుంది అనేది కూడా చూడాలి.

#90 Years Age

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Singitham Srinivasrao Ready To Make Film Related Telugu News,Photos/Pics,Images..