మణిరత్నం మల్టీస్టారర్ సంగీత దర్శకుడిగా స్టార్ సింగర్!  

Singer Sid Sriram Composing To Tamil Movie-

కోలీవుడ్ – టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన సింగర్ సిద్ శ్రీరామ్ ఎట్టకేలకు తన కలని నిజం చేసుకోబోతున్నాడు.కడలి సినిమాలో మొదటి పాట పాడిన సిద్ అనంతరం ‘ఐ’ సినిమాలో నువ్వుంటే నా జతగా అనే సాంగ్ తో జనాల్ని ఆకర్షించాడు.

Singer Sid Sriram Composing To Tamil Movie--Singer Sid Sriram Composing To Tamil Movie-

ఇక తెలుగులో నిన్నుకోరి – గీత గోవిందం వంటి సినిమాల్లో పాడిన పాటలకు సిద్ శ్రీరామ్ మరింత క్లిక్కయ్యాడు.అయితే గత కొంత కాలంగా సంగీత దర్శకుడిగా మారాలని ప్రయత్నాలు చేస్తున్న సిద్ శ్రీరామ్ కి మణిరత్నం మొదటి అవకాశాన్ని ఇచ్చాడు.మణిరత్నం వద్ద అసిస్టెండ్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ధనా శేఖర్ ‘వానం కోట్ఠాటూమ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

జివి.ప్రకాష్ కుమార్ – విక్రమ్ ప్రభు ఈ సినిమాలో కథానాయకులు.అయితే మొదట ఈ సినిమా కోసం మ్యూసిక్ డైరెక్టర్ గా 96 ఫెమ్ గోవింద్ వసంత ని అనుకోగా ఆ తరువాత ఏమైందో ఏమో గాని సిద్ శ్రీరామ్ కి మొదటి అవకాశాన్ని ఇచ్చారు.సింగర్ గా పాపులర్ అయిన సిద్ ఈ సినిమాతో ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.