షూటింగ్ పేరుతో ఎగురుతున్న విమానం రెక్కపై నడుస్తూ ....   Singer Who Died On The Wing Of The Plane Flying Under The Shooting     2018-10-24   23:49:37  IST  Sai M

విన్యాసాలు చేసి ప్రేక్షకులను మెప్పించాలనుకోవడంలో తప్పులేదు కానీ మరీ అతి విశ్వాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకునే స్థాయిలో విన్యాసాలు చేయడం మాత్రం అన్ని సమయాల్లోనూ సురక్షితం కాదు. కొలంబియాలో జరిగిన ఓ సంఘటన ఇలాంటి విషయాల్లో అతి పనికిరాదనే విషయాన్ని గుర్తు చేస్తోంది.

ప్రముఖ కెనడీయన్‌ రాపర్‌ జాన్‌ జేమ్స్‌(33) కు ప్రమాదకర విన్యాసాలే తనకు చాలా గుర్తింపు తెచ్చిపెట్టాయి. చివరకు అవే ప్రాణాలు తీశాయి. ఓ మ్యూజిక్‌ వీడియో షూటింగ్‌ కోసం ఎగురుతున్న చిన్న విమానం రెక్కలపై నడిచే సన్నివేశాన్ని చిత్రీకరించాలనుకున్నారు. ఇందు కోసం తీవ్రమైన శిక్షణ కూడా తీసుకున్నాడు. జేమ్స్‌ విమానం రెక్కపై నడుస్తూ అలా చివరి వరకూ వెళ్లిపోయాడు. అదే సమయంలో విమానం అటువైపు వంగింది. దీంతో పట్టుతప్పి రెక్కపై నుంచి జారి కిందపడ్డాడు. ఆ సమయంలో ప్యారాచూట్‌ను తెరిచేందుకు కూడా అతనికి సమయం లేకుండా పోయిందని.. దీంతో కిందపడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని నిర్వహకులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆ విమానం సురక్షితంగా దిగింది.