దర్శకేంద్రుడి నిర్మాణంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సింగర్ సునీత కుమారుడు?

Singer Sunitha S Son Who Made His Debut As A Hero In Director Endar S Production ,Singer Sunitha,Akash ,director Endar S Production, Gangana Moni Shekhar,Director K Raghavendra Rao,Bhavna Valapandal,Akash,Sarkar Naukari

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి పరిచయం అవసరం లేదు.గత కొన్ని సంవత్సరాలుగా తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సునీత గత రెండు సంవత్సరాల క్రితం రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

 Singer Sunitha S Son Who Made His Debut As A Hero In Director Endar S Productio-TeluguStop.com

అయితే ఈమెకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారని విషయం తెలిసిందే.అయితే కుమార్తె ఇప్పటికే సింగర్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Akash, Endar, Raghavendra Rao, Ganganamoni, Sarkar Naukari, Sunitha-Movie

ఇక సునీత కుమారుడు ఆకాశ్ ఇదివరకే విదేశాలలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు.గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం గత ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే నటనలో శిక్షణ తీసుకున్న ఆకాశ్ సోషల్ మీడియా వేదికగా డాన్స్ పెర్ఫార్మెన్స్ లకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వచ్చారు.ఇక ఆకాష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ పనులు గురువారం ఎంతో లాంఛనంగా ప్రారంభం అయ్యాయి.

Telugu Akash, Endar, Raghavendra Rao, Ganganamoni, Sarkar Naukari, Sunitha-Movie

ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి సర్కారు నౌకరి అనే టైటిల్ ఖరారు చేశారు.ఈ సినిమాలో ఆకాశ్ సరసన భావనా వళపండల్ నటిస్తోంది.ఈమెకు హీరోయిన్‌గా ఇదే మొదటి చిత్రం.ఈ చిత్రానికి గంగన మోని శేఖర్ దర్శకత్వం వహించగా ఆర్కే టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ఎంతో ఘనంగా ప్రారంభమైంది.సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సునీత కుమారుడు హీరోగా ఎలాంటి ఆదరణ పొందుతారో తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube