సింగర్ సునీతను వాట్సాప్ నంబర్ అడిగిన నెటిజన్... సునీత ఏమన్నదంటే

సింగర్ సునీత ఎవరో తెలియని తెలుగు సంగీతాభిమాని ఉండరంటే అతిషయోక్తి కాదు.తన సుమధుర గాత్రంతో ఎన్నో వేల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ సునీత పాటలకే కాదు, సునీతకు కూడా అభిమానులు ఉంటారనేది జగమెరిగిన సత్యం.

 Singer Sunitha Whatsapp Number Netizen Reply-TeluguStop.com

కొంత మంది దర్శకులు సినిమాలలో నటించమని అడిగిన సందర్భాలు ఉన్నాయని సునీత ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.తాజాగా డిజిటల్ మీడియా దిగ్గజం మ్యాంగో మీడియా అధినేత రామ్ ను రెండో వివాహం చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

తాజాగా కోవిడ్ సమయంలో ఎటూ బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉండడంతో రోజూ రాత్రి 8 గంటలకు లైవ్ లోకి వస్తానని, మీకు నచ్చిన పాట పాడటానికి ప్రయత్నిస్తానని సునీత తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.అయితే ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఓ నెటిజన్ సునీతను వాట్సాప్ నంబర్ అడిగాడు.

 Singer Sunitha Whatsapp Number Netizen Reply-సింగర్ సునీతను వాట్సాప్ నంబర్ అడిగిన నెటిజన్… సునీత ఏమన్నదంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఆ నెటిజన్ కు సునీత దిమ్మతిరిగే జవాబిచ్చింది.సో సారీ అండీ అంటూ నెటిజన్ ప్రశ్నకు తిరస్కరించింది.

అయితే నెటిజన్ పట్ల సున్నితంగా వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  కరోనా విజృంభిస్తున్న తరుణంలో అందరూ అవసరమైతేనే బయటకు వెళ్తూ, మాస్క్ ధరిస్తూ ఉండాలని సింగర్ సునీత తన అభిమానులకు సూచించింది.

#ViralNews #Singer Sunitha #SingerSunitha #SunithaWhatsapp #SingerSunitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు