సింగర్‌ సునీత రెండవ పెళ్లి.. ఇతడే వరుడు   Singer Sunitha To Get Married Again     2018-07-19   14:54:26  IST  Ramesh P

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన సింగర్‌ మరియు డబ్బింగ్‌ ఆర్టిస్టు అయిన సునీత గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో ఉంటూనే ఉంది. ఆమద్య ఈమె వైవాహిక జీవితం గురించి చాలా కాలం పాటు మీడియాలో చర్చ జరిగింది. భర్తకు ఈమె దూరంగా ఉంటుందని, భర్తతో పడలేక ఈమె అతడిని వదిలేసిందంటూ రక రకాలుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత సునీత భర్తను అసమర్ధుడు అంటూ వదిలించుకుందని, ఆయన అనుమానిస్తుండనే ఉద్దేశ్యంతోనే విడిగా ఉంటుందని సునీత గురించి చెడు ప్రచారం వచ్చింది. పిల్లలతో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సునీత గురించి ఆమద్య షాకింగ్‌ పుకార్లు షికార్లు చేశాయి.

ఆ వార్తలు నిజం కాదని, వాటిపై సునీత మరియు ఆ కాంగ్రెస్‌ నాయకుడు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా సునీత రెండవ పెళ్లికి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ భార్య రేణుదేశాయ్‌ తన పిల్లలు పెద్ద వారు అవుతున్న నేపథ్యంలో ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. రేణుదేశాయ్‌ మాదిరిగానే సునీత కూడా రెండవ పెళ్లి కోసం అడుగులు వేస్తుందట.

చిన్నతనంలోనే సునీత వివాహం అయ్యింది. చిన్నతనంలోనే ఇద్దరు పిల్లలకు సునీత తల్లి అయ్యింది. ఇప్పుడు ఆ పిల్లలు పెద్ద వారు అయ్యి, చదువుల నిమిత్తం ఆమె వద్ద ఉండకుండా దూరంగా ఉంటున్నారు. మరో వైపు భర్త నుండి విడాకులు తీసుకున్న సునీత రెండవ పెళ్లికి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యులు రెండవ పెళ్లి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సునీతపై ఆసక్తిగా ఉన్నాడని, అతడు సునీతను వివాహం చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాడని తెలుస్తోంది. గతంలో వివాహం అయిన ఆ వ్యక్తి కొన్ని కారణాల వల్ల భార్య నుండి విడాకులు తీసుకుని సింగిల్‌గా జీవిస్తున్నాడు.

ఆ వ్యక్తికి ఒక కొడుకు ఉన్నాడట. ఆయనకు సునీతతో వివాహం చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. సునీత కూడా ఒంటరి జీవితానికి స్వస్థి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సింగర్‌ సునీత వివాహం గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే తప్ప ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.