మందుబాబులపై సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్.. ఎందుకంటే?

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా.చాలా వరకు సెలబ్రెటీలు తమ వంతు సహాయం తో ముందుకు వస్తున్నారు.

 Singer Sunitha Shocking Comments On Liquor Sales, Liquor Sales, Lockdown, Singer-TeluguStop.com

ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా ప్లాస్మా, ఆక్సిజన్ గురించి వివరాలు అందిస్తున్నారు.ఇక ప్రస్తుతం దేశంలో తీవ్రత ఎక్కువ కావడంతో నిన్నటి నుండి లాక్ డౌన్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే సోషల్ మీడియా లైవ్ ద్వారా సెలబ్రిటీలు ప్రజలకు సలహాలు కూడా అందిస్తున్నారు.


ఇక తెలుగు సింగర్ సునీత కూడా ప్రస్తుతం ప్రజలకు ధైర్యం నింపడానికి, తన పాటలతో కాసేపు సంతోష పెట్టడానికి సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు లైవ్ అందిస్తుంది.

ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి తెలుపుతూ.ఆరోగ్య పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తుంది.అంతేకాకుండా మీరు కోరిన పాటలను వినిపిస్తానంటూ తెగ ముచ్చటిస్తుంది.ఇక ఇటీవల తన పుట్టినరోజు కూడా సంతోషంగా జరుపుకోలేదని.

టిఎన్ఆర్ మరణ వార్త కలచివేసిందని తెలిపింది.


Telugu Corona, Covid Pandemic, Full Rush, Liquor, Liquor Shops, Lockdown, Oxygen

ఇక తాజాగా లాక్ డౌన్ కదా అందరూ సామాన్లు తెచ్చుకున్నారా అంటూ ప్రశ్నించింది.రెండు రోజులకు సరిపడా సామానులు తెచ్చుకుంటే ఆ తర్వాత లైన్ లో ఉండకూడదు అని తెలిపింది.ఇదిలా ఉంటే ఎక్కడ చూసినా మద్యం దుకాణాలు నిండి పోవడమనేది ఆశ్చర్యం అని నవ్వుతూ స్పందించింది సునీత.

కారణం లాక్ డాన్ అనగానే మంగళవారం సాయంత్రం నుంచి మందుబాబులు వైన్స్ ల ముందు తెగ క్యూకడుతున్నారు.


దేవుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్నట్లు తమ సరుకు కోసం భారీ లైన్లతో క్యూ కడుతున్నారు.మంగళవారం రోజు మొత్తం రూ.125 కోట్లకు పైగా బిజినెస్ జరుగగా నిన్న ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దాదాపు రూ.94 కోట్ల మద్యం సేల్ అవ్వడంతో అందర్నీ ఆశ్చర్య పరిచింది.అంటే దీన్ని బట్టి ప్రపంచం మొత్తం ప్రాణాల మీద భయంతో వణికి పోతుంటే మందు బాబులు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా.

ఎగబడటంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube