టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత.15 సంవత్సరాల వయస్సులోనే సింగర్ గా కెరీర్ ప్రారంభించిన సునీత వందల సంఖ్యలో సినిమాలకు పాటలు పాడటంతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన సునీత 19 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు.
అయితే కొన్ని కారణాల వల్ల సునీతకు, ఆమె భర్తకు మధ్య మనస్పర్దలు రావడంతో వాళ్లు విడిపోయారు.
సునీతకు ఇద్దరు సంతానం.చాలా సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉన్న సునీత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ గతంలో వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలు నిజం కాలేదు.కొన్ని నెలల క్రితం టాక్ షోలో సునీత మాట్లాడుతూ తనకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తాను ఎప్పటికీ సింగిల్ గానే ఉంటానని వెల్లడించారు.
అయితే సునీత తన నిర్ణయాన్ని మార్చుకున్నారని రెండో పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.మీడియా రంగానికి చెందిన బిజినెస్ మేన్ ను సునీత వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో నిన్నటి నుంచి సునీత రెండో పెళ్లి గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే వైరల్ అవుతున్న వార్తలపై సునీత స్పందించాల్సి ఉంది.
స్టార్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సునీతకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ఆమె రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
త్వరలో సునీత పెళ్లి గురించి అధికారిక ప్రకటన వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.సునీత వయస్సు 42 సంవత్సరాలు కాగా సునీత స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది.
సునీత వైరల్ అవువున్న వార్తలపై స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.