డైరెక్టర్ బాపుతో మర్చిపోలేని అనుభవం.. ఆనాటి స్మృతులను గుర్తు చేసుకున్న సింగర్ సునీత?

Singer Sunitha Recalls Memories With Director Bapu

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తనదైన శైలిలో పాటలు పాడి ప్రేక్షకులను అలరించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో చోటు సంపాదించుకుంది.

 Singer Sunitha Recalls Memories With Director Bapu-TeluguStop.com

సింగర్ గానే కాకుండా సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసినప్పటికీ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే తాజాగా సింగర్ సునీత తన జీవితంలో దర్శకుడు బాపుతో తనకున్న అనుబంధం గురించి, ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

తెలుగు ప్రేక్షకులకు బాపు-రమణలు బాగా సుపరిచితమే.అప్పట్లో బాలయ్య నటించిన ముత్యాలముగ్గు సినిమా నుంచి శ్రీరామరాజ్యం సినిమా వరకూ దర్శకుడు బాపు తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు.

 Singer Sunitha Recalls Memories With Director Bapu-డైరెక్టర్ బాపుతో మర్చిపోలేని అనుభవం.. ఆనాటి స్మృతులను గుర్తు చేసుకున్న సింగర్ సునీత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాపుగారు బొమ్మ గీశారు అంటే అందమంతా అందులోకి వస్తుంది అంటారు.అందుకే అమ్మాయిలను బాపు గారి బొమ్మలా ఉన్నావు అని అంటూ ఉంటారు.

Telugu Autograph, Bapu, Radhagopalam, Sunitha, Sriramarajyam-Movie

బాపుగారు తెరకెక్కించిన రాధాగోపాలం, శ్రీరామరాజ్యం సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా సునీత పని చేసిందట.ఒకసారి సునీత బాపు గారిని ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు బాపు గారు రివర్స్ లో సునీత గారు నేను మీకు అభిమానిని మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని ఆమెను అడిగారట.ఇదంతా రాధాగోపాలం సినిమాలో స్నేహా పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు జరిగిందట.అప్పుడు సునీత కళ్ళల్లో నీళ్ళు తిరిగాయట.

అప్పుడు బాపుగారు ఇలా రాసి సంతకం పెట్టేశారట.సరస్వతీ పుత్రిక ఛి సౌ సునీతకు అమ్మవారి అనుగ్రహం సదా ఉండాలని కోరుకుంటూ మీ వీరాభిమాని బాపు అని రాసి ఇచ్చారట.

ఇక అంతకంటే ఏం కావాలి అంటూ సునీత ఎమోషనల్ అయ్యింది.

#Sriramarajyam #Bapu #Sunitha #Radhagopalam #Autograph

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube