ఈ సింగర్ కి వయసు పెరుగుతున్నా అందం మాత్రం తగ్గలేదు ...

తెలుగులో తన మధురమైన గొంతుతో ఎన్నో మధురమైన మెలోడీ పాటలను పాడి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ సింగర్ “సునీత” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సింగర్ సునీత గాన రంగంలో బాగానే గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది.

 Singer Sunitha Looks Stunning In 40 Years Old Age, Telugu Singer, Sunitha , Sing-TeluguStop.com

దీంతో ఇటీవల తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి మ్యాంగో మ్యూజిక్ సంస్థల యజమాని వీరపనేని రామ కృష్ణని పెళ్లి చేసుకుంది.దీంతో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో సింగర్ సునీత సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన సమాచారం మరియు ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా సింగర్ సునీత తన అధికారిక ఖాతాలో అందమైన ఫోటోలను షేర్ చేసింది.దీంతో నెటిజన్లు సింగర్ సునీత అందానికి మంత్ర ముగ్ధులయ్యారు.అంతేకాకుండా సింగర్ సునీత కి వయసు పెరుగుతున్న కొద్దీ అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా గతంలో సింగర్ సునీత తన రెండో పెళ్లి విషయంపై స్పందిస్తూ తన పిల్లల భవిష్యత్తు మరియు కుటుంబ బరువు బాధ్యతలు గురించి క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే రెండో పెళ్లి నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.అంతేకాకుండా తన భర్త వీరపనేని రామ్ కుటుంబ సభ్యులతో తమకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నీ ఆలోచించిన తర్వాతే ఇద్దరు పెళ్లి చేసుకున్నామని క్లారిటీ ఇచ్చింది.సింగర్ సునీత కేవలం తన పాటలతో మాత్రమే కాకుండా పలువురు హీరోయిన్ల కి డబ్బింగ్ చెప్పి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే పదికి పైగా నంది అవార్డులు, 5 కి పైగా ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube