రామ్ తో అలా పరిచయం.. రెండోపెళ్లిపై స్పందించిన సునీత..!  

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత, బిజినెస్ మేన్ రామ్ వీరపనేనిల వివాహం ఈ నెల 9వ తేదీన శంషాబాద్ లోని ఒక ఆలయంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.పెళ్లి తరువాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవిత భాగస్వామి రామ్ వీరపనేని గురించి ఆసక్తికరమైన విషయాలను సునీత వెల్లడించారు.

TeluguStop.com - Singer Sunitha Interesting Comments About Her Husband

రామ్ తన సోషల్ మీడియా ఖాతాలను చూసుకునే వారని చాలా సంవత్సరాల నుంచి రామ్ తో తనకు పరిచయం ఉందని సునీత తెలిపారు.

రామ్ కు, తనకు మధ్య ఉన్న స్నేహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని భావించి ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నామని సునీత తెలిపారు.

TeluguStop.com - రామ్ తో అలా పరిచయం.. రెండోపెళ్లిపై స్పందించిన సునీత..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రామ్ ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిన సమయంలో మొదట పిల్లలే తనకు గుర్తుకు వచ్చారని తను తీసుకున్న పెళ్లి నిర్ణయం వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదని తాను భావించానని సునీత తెలిపారు.చాలా సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని తనకు చెబుతూనే ఉన్నారని అన్నారు.

Telugu Her Husband, Interesting Comments, Ram Veerapaneni, Singer Sunitha-Movie

అయితే పిల్లల వల్ల తాను పెళ్లి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయానని ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్లు కావడంతో పాటు వాళ్లకు పరిస్థితులను అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉందని తెలిపారు.పిల్లలకు రామ్ ను వివాహం చేసుకుంటున్నానని చెప్పగా పిల్లలు ఎంతో సంతోషించారని సునీత పేర్కొన్నారు.కుటుంబం తనకు ప్రతి విషయంలో మద్దతు ఇచ్చిందని.అర్థం చేసుకునే పిల్లలు లభించడం తన అదృష్టమని సునీత పేర్కొన్నారు.

రామ్ రూపంలో కష్టాల్లో, సుఖాల్లో తోడుగా నిలిచే వ్యక్తి దొరికారని సునీత అన్నారు.రామ్ లాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు.

ఇరు కుటుంబాలు పెద్ద కుటుంబాలు అని అందువల్లే అతిథుల జాబితా 200కు చేరిందని సునీత వెల్లడించారు.

#Ram Veerapaneni #Her Husband #Singer Sunitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు