సింగర్ సునీత కోసం వాలెంటైన్ డే సప్రైజ్ ప్లాన్ చేసిన భర్త..!

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ సునీత గురించి తెలియని వారంటూ ఎవరు లేరు.ఆమె గాత్రంతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Singer Sunitha, Husband Ram, Valantens Day , Spcialgift, Surprise,latest Tollywo-TeluguStop.com

ఇక సునీత-రామ్ వీరపనేనిల వివాహం ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే.తాజాగా సునీత తన జీవితంలో వచ్చిన కొత్త వ్యక్తి అయిన రామ్ వీరపనేని పట్ల చాలా కేరింగ్‌ గా ఉన్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఫోటోలను సైతం సునీత తన సోషల్ మీడియా అకౌంట్‌ లో పోస్ట్ చేసింది

ఇక రామ్ వీరపనేని సైతం సింగర్ సునీత కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.ముఖ్యంగా వివాహం జరిగిన తర్వాత వేలంటైన్ డే సందర్భంగా సునీతను సర్ ప్రైజ్ చేసేందుకు రామ్ వీరపనేని ఒక విలువైన కానుక ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా సునీత తన వివాహం తర్వాత కుమార్తె కెరీర్ సెట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.సునీత కుమార్తె శ్రేయ ఇప్పటికే నేపథ్య గాయనిగా మంచి పేరు సంపాదించింది.

అంతేకాదు సునీత పేరును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతోంది.

అంతేకాదు సునీత కుమారుడు సైతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.

అతడు సైతం తన విద్యాభ్యాసం అయిన తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం చేయడం ద్వారా సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు.అటు రాం వీరపనేని సైతం సునీత పిల్లల కెరీర్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక సునీత సైతం ముందుగా ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం షోస్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది.దీంతో సునీత త్వరలోనే బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది.అలాగే పలువురు హీరోయిన్లు సునీత గాత్రం ఎప్పుడు దొరుకుతుందా ఎదురు చూస్తున్నారు.పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పాల్సి ఉంది.

ఆ కమిట్స్మెంట్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంది.ఇక సునీత ఇలా బిజీగా తన డైరీ మొత్తం పూర్తి చేయాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube