సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఆస్తుల విలువ తెలిస్తే అస్సలు నమ్మరు- Singer Sunitha Husband Ram Properties Ans Assetes

singer sunitha husband ram veerapaneni properties and assetes, singer sunitha, singer sunitha marriage, singer sunitha real life, Mango Media,YouTube - Telugu Mango Media, Ram Veerapaneni Properties, Singer Sunitha, Singer Sunitha Husband Ram Veerapaneni Properties And Assetes, Singer Sunitha Marriage, Singer Sunitha Real Life, Sunitha Husband, Youtube

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఉపధ్రష్ట ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

 Singer Sunitha Husband Ram Properties Ans Assetes-TeluguStop.com

సింగర్ సునీత రామ్ వీరపనేని చేయి పట్టుకున్నప్పుడు ఆమె కళ్ళలో కనిపించిన ఆనందం అందర్నీ పలకరింపు చేసిందనే చెప్పుకోవాలి.డిజిట‌ల్ మీడియా ప‌ర్స‌న్, బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో డిసెంబర్ నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు సునీత.

వీళ్ళిద్దరూ జనవరి 9వ తేదీన హైదరాబాద్ లోని శంషాబాద్‌లోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా, ఆడంబరంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొన్నారు.

 Singer Sunitha Husband Ram Properties Ans Assetes-సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఆస్తుల విలువ తెలిస్తే అస్సలు నమ్మరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజానికి సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లయింది.ఆమె తన మొదటి భర్త కిరణ్ కుమార్ గోపరాజు తో వైవాహిక జీవితం కొనసాగిస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.అయితే సునీత, కిరణ్ కుమార్ ల మధ్య తీవ్ర విభేదాలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

ఆ రోజు నుంచి సునీత తన ఇద్దరు పిల్లల బాధ్యతను తన భుజాలపై వేసుకొని వారిని పెంచి పెద్ద చేసారు.అలాగే తన సింగింగ్ కెరీర్ ని నిర్లక్ష్యం చేయకుండా ఎన్నో మధురమైన పాటలు పాడి నంది అవార్డులతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నారు.

అయితే తన కూతురు, కొడుకు పెద్దయి పెళ్లిడు వచ్చేంత వరకూ సునీత తన రెండవ పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన చేయలేదు.ఎప్పుడైతే తన ఇద్దరు పిల్లలు తనకు పెళ్లి చేయడానికి పూర్తిగా అంగీకరించారో అప్పుడే సునీత వీరపనేని ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

సునీత తల్లిదండ్రులు కూడా ఆమె రెండో పెళ్లి విషయంలో ఫుల్ సపోర్ట్ గా నిలిచారు.తన కుటుంబ సభ్యులందరి ఇష్టంతోనే సునీత రెండవ పెళ్లి చేసుకున్నారు.

మ్యాంగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా రామ్ వీరపనేని పనిచేస్తున్న సమయంలో సునీత పరిచయమయ్యారు.అప్పటికే ఆమె మ్యాంగో మీడియా సంస్థకు ఎన్నో పాటలను పాడారు.ఆ విధంగా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.సునీత సోషల్ మీడియా అకౌంట్స్ ను కూడా రామ్ వీరపనేని మేనేజ్ చేసేవారు.అయితే కొద్ది రోజుల తర్వాత వీళ్ళిద్దరి స్నేహం ప్రేమగా మారింది.తమ ప్రేమను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాలని సునీత అనుకున్నారు.

ఈ విషయం గురించి తల్లిదండ్రులతో పాటు తన పిల్లలతో సునీత చర్చించారు.అయితే సునీత రామ్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఎవరూ కూడా అభ్యంతరం తెలపలేదట.

తనకు ఒక తోడు కావాలి.అలాగే తన నిర్ణయం పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అని ఆమె అనుకున్నారు.అయితే తన పిల్లలు తాను రామ్ ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పగానే ఎంతో సంతోషించి కౌగలించుకున్నారు అని ఆమె అన్నారు.తన స్నేహితుడిగా ఎంతోకాలం ఉన్న రామ్ తన భాగస్వామి కావడం తన అదృష్టమని సునీత చెబుతున్నారు.

ఇకపోతే రామ్ వీరపనేని ఆస్ట్రేలియాలో తన చదువు పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు.ప్రస్తుతం వాక్కెడ్ అవుట్ మీడియా సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రామ్ ప్రముఖ కంపెనీల లో వందల కోట్ల విలువైన షేర్లను కలిగి ఉన్నారని తెలుస్తోంది.

#RamVeerapaneni #Youtube #SingerSunitha #Sunitha Husband #Mango Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు