దాదాపు రెండు దశాబ్దాల క్రితం సింగర్ గా కెరీర్ ను ప్రారంభించారు సునీత.దాదాపు 500 సినిమాల్లో కీలక పాత్రలకు డబ్బింగ్ చెప్పిన సునీత వేల సంఖ్యలో పాటలు పాడారు.గుంటూరుకు చెందిన సునీత 8 సంవత్సరాల పాటు లలిత సంగీతంలో శిక్షణ పొంది త్యాగరాజ ఆరాధనోత్సవాలలో కూడా పాల్గొన్నారు.15 సంవత్సరాల వయస్సులోనే సింగర్ గా కెరీర్ ను ప్రారంభించిన సునీత తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పాటలు పాడి గాయనిగా గుర్తింపును సంపాదించుకున్నారు.
ఆమె పాడిన పాటలు, డబ్బింగ్ కు నంది పురస్కారాలు, ఫిలిం ఫేర్ పురస్కారాలతో పాటు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.గత నెల జనవరి 9వ తేదీన డిజిటల్ మీడియా ద్వారా పేరుప్రఖ్యాతులను సంపాదించుకున్న రామ్ వీరపనేనిని వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు.
అయితే పెళ్లి తరువాత సునీతకు కొత్త ఆఫర్లు వస్తున్నాయని ఒక కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించే ఆఫర్ సునీతకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఒక ప్రముఖ ఛానల్ సునీతకు జడ్జిగా వ్యవహరించడానికి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసిందని అయితే సునీత ఈ ఆఫర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.మరి ఈ ఆఫర్ కు సునీత అంగీకరిస్తారో లేదోచూడాల్సి ఉంది.సునీతకు హీరోయిన్ గా కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లకు ఆమె అంగీకరించలేదు.
మరి జడ్జిగా చేయడానికి అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.
ప్రస్తుతం ఈటీవీ ఛానల్ లో రోజా జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తుండగా సునీతకు రోజా పోటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.
ఈ ఆఫర్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.బుల్లితెరపై పలు సింగింగ్ షోలకు జడ్జిగా వ్యవహరించిన సునీత కామెడీ షోలకు కూడా జడ్జిగా చేయడానికి అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.