ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన సింగర్ సునీత.. అదేమిటంటే..?

టాలీవుడ్ స్టార్ సింగర్లలో ఒకరైన సునీత ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు.ప్రతిరోజూ రాత్రి 8 : 00 గంటలకు ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వస్తానని ఆమె వెల్లడించారు.అరగంట పాటు లైవ్ లో నెటిజన్లు కోరిన పాటలను పాడి వినిపిస్తానని ఆమె వెల్లడించారు.కరోనా సెకండ్ వేవ్ విజృంభణ వల్ల తాను ఇంటికే పరిమితమయ్యానని సునీత చెప్పుకొచ్చారు.

 Singer Sunitha Emotional Video About Present Situation Instagram-TeluguStop.com

లైవ్ లో తెలుగుతో పాటు ఇతర భాషల పాటలను కూడా ఆమె వినిపించారు.

గోదావరి, తమ్ముడు, ఇతర సినిమాల్లోని పాటలను సునీత పాడారు.

 Singer Sunitha Emotional Video About Present Situation Instagram-ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన సింగర్ సునీత.. అదేమిటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం కుటుంబ రక్షణ కొరకు, వ్యక్తిగత రక్షణ కొరకు తాను పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానని సునీత చెప్పుకొచ్చారు.కరోనా విజృంభిస్తున్న తరుణంలో అందరికీ రిలీఫ్ కలిగించాలనే ఉద్దేశంతో తాను ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వస్తున్నానని సునీత తెలిపారు.

ఇంపార్టెంట్ పనులు లేకపోతే పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని సునీత సూచనలు చేశారు.

ఆ తరువాత ఎస్పీ బాలు గురించి సునీత మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎస్బీ బాలుకు తను పాడిన ప్రతి పాట గుర్తుంటుందని పాట పాడే సమయంలో జరిగిన విషయాలను కూడా ఆయన గుర్తుంచుకుంటారని సునీత చెప్పుకొచ్చారు.పాటలోనే ఎస్పీ బాలు ప్రతి నిమిషం జీవించారని.

ఎస్బీ బాలు పాటలనే ప్రేమించారని ఆమె తెలిపారు.మన దేశంలోనే చిత్ర గొప్ప గాయని అని సునీత వెల్లడించారు.

Telugu Emotional Video, Present Situation, Singer Sunitha, Sunitha Instagram-Movie

వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి నేనున్నానని పాటను తాను అంకితమిస్తున్నానని సునీత తెలిపారు.ప్రతిరోజు అరగంట పాటు నెటిజన్లు కోరిన పాటలను పాడి వినిపిస్తానని సునీత చేసిన ప్రకటన పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.కరోనా వల్ల సునీత హాజరు కావాల్సిన కొన్ని ఈవెంట్లు సైతం క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.

#Emotional Video #Singer Sunitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు