కారణం లేకుండా నిందించారు.. సునీత ఎమోషనల్ పోస్ట్..?

2021 సంవత్సరం జనవరి 9వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు సునీతసునీత రెండో పెళ్లికి సంబంధించి వార్తలు తెగ వైరల్ కాగా ఆమె మ్యారేజ్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.నేడు మహిళా దినోత్సవం కావడంతో సోషల్ మీడియాలో సునీత ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

 Singer Sunitha Emotional Post Goes Viral In Social Media-TeluguStop.com

సునీత పోస్ట్ లో ఎదురైన ట్రోల్స్ గురించి ప్రధానంగా స్పందించారు.

పర్సనల్ లైఫ్ లో ఎదురైన ఇబ్బందుల గురించి వివరించేలా ఆ పోస్ట్ లో సునీత ఘాటు కామెంట్లు చేశారు.

 Singer Sunitha Emotional Post Goes Viral In Social Media-కారణం లేకుండా నిందించారు.. సునీత ఎమోషనల్ పోస్ట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నా లైఫ్ ను మీరే నిర్ణయిస్తారని ట్రోల్స్ చేస్తూ ప్రతిసారి క్రిందికి లాగుతూ నన్ను అభద్రతా భావానికి గురి చేస్తున్నారని సునీత పేర్కొన్నారు.నాకు ఫెయిల్యూర్ ఎదురైతే చూసి నవ్వడంతో పాటు ఇబ్బందులు పెడతారని సునీత అన్నారు.

ఏ రీజన్ లేకుండా తనను నిందించిన వాళ్లు ప్రస్తుతం ఉమెన్స్ డే విషెస్ చెబుతున్నారా అని ప్రశ్నించారు.

తనకు ఉమెన్స్ డే విషెస్ చెప్పిన వారి శుభాకాంక్షలను తాను స్వీకరిస్తానని తనపై ఎవరైతే రాళ్లు విసిరారో ఆ రాళ్లను తాను పునాదులుగా మార్చుకుంటానని తాను మారి లైఫ్ లో ముందుకు వెళతానని ఆమె అన్నారు.చిరునవ్వుతో అన్నిటినీ తాను క్షమిస్తానని తాను ఒక స్త్రీని కాబట్టే అన్నిటినీ సహించానని సునీత అన్నారు.ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెబుతూ సునీత పోస్ట్ ను ముగించారు.

ఈ మధ్య కాలంలో కొంతమంది నెటిజన్లు సునీతను ట్రోల్ చేయడంతో సునీత సున్నితంగా వాళ్లకు కౌంటర్లు ఇచ్చారు.మరోవైపు పెళ్లి తర్వాత కూడా సింగర్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.

పలు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లు కండక్ట్ చేస్తున్న ఈవెంట్లలో పాల్గొని సునీత సందడి చేస్తున్నారు.

#Goes Viral #Singer Sunitha #Emotional Post #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు