రెండో పెళ్లికి వాళ్లే కారణం.. సునీత ఎమోషనల్ పోస్ట్..!

స్టార్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతుందని వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి.అయితే గతంలో సునీత తనకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని స్టేట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో చాలామంది ఆ వార్తలను నిజమని నమ్మలేదు.

 Singer Sunitha Emotional Post About Her Second Marriage,  Chairman Of A Media Ho-TeluguStop.com

అయితే ఊహించని విధంగా నేడు సునీత డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో నిశ్చితార్థం చేసుకున్నారు.జనవరిలో సునీత రామ్ వీరపనేని పెళ్లి జరగనుందని సమాచారం.

నిశ్చితార్థం అనంతరం సునీత ఫేస్ బుక్ వేదికగా 42 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను, ఇతర విషయాలను పంచుకున్నారు.తాను రెండో పెళ్లి చేసుకోవడానికి పిల్లలే కారణం అని సునీత వెల్లడించారు.

అందరు తల్లుల్లా తను కూడా పిల్లలు జీవితంలో సెటిల్ కావాలని ఆశించానని.అదే సమయంలో పిల్లలు తను కూడా లైఫ్ లో స్థిరపడాలని అనుకున్నారని తెలిపారు.

తన పిల్లలు కోరుకున్న క్షణం జీవితంలో ఎట్టకేలకు వచ్చిందని.తనకు కొత్త జీవితం కావాలని కోరుకుంటున్న పిల్లలు ఉన్నందుకు తాను అదృష్టవంతురాలినని పేర్కొన్నారు.ఒక మంచి స్నేహితుడిగా రామ్ తన జీవితంలోకి వచ్చి జీవిత భాగస్వామిగా మారబోతున్నాడని ఆమె వెల్లడించారు.త్వరలో మేమిద్దరం వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నామని సునీత తెలిపారు.

తన లైఫ్ కు సంబంధించిన రహస్యాలను ప్రైవేట్ గా ఉంచుతున్నానని ఆ విషయాన్ని అర్థం చేసుకున్న శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని సునీత అన్నారు.సునీత ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

నేడు సునీత, రామ్ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సునీత భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube