డబ్బింగ్ స్టూడియోలో డైరెక్టర్ చేసిన పనికి అవాక్కయ్యా... సింగర్ సునీత కామెంట్స్

సినిమా పరిశ్రమలో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు.వాళ్ళ నుండి సున్నితంగా తప్పించుకొని మన పని చూసుకోవడం బెస్ట్ అని, తద్వారా పరిశ్రమలో సంబంధాలు తెగిపోకుండా ఉంటాయని అంటారు.

 Singer Sunitha Comments On The Work Done By The Director In The Dubbing Studio-TeluguStop.com

సంగీతభిమానులకు సింగర్ సునీత పరిచయం అక్కరలేని పేరు.మామూలుగా నటులకు గుర్తింపు, స్టార్ స్టేటస్ ఉంటుంది.

కాని సింగర్ సునీత గాత్రానికి అభిమానులు ఉన్నారు.ముఖ్యంగా ఇప్పుడున్న లీడ్ సింగర్ లలో సునీత ఒకరు.

 Singer Sunitha Comments On The Work Done By The Director In The Dubbing Studio-డబ్బింగ్ స్టూడియోలో డైరెక్టర్ చేసిన పనికి అవాక్కయ్యా… సింగర్ సునీత కామెంట్స్-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సునీత ఇటీవలే డిజిటల్ మీడియా అధినేత రామ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.అయితే అప్పటి నుండి సునీత సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు.

వరుస సినిమాలు చేస్తూ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహారిస్తూ ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా ఉంటోంది సింగర్ సునీత.అయితే సినిమా పరిశ్రమలో తనకు జరిగిన ఓ వింత అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది సునీత.

ఓ సినిమా కోసం డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ స్టూడియోకు వెళ్లానని అప్పడు ఆ సినిమా డైరెక్టర్ మొదట మీ అభిమానినని అన్నాడని, కొద్ది సేపటి తరువాత మేడమ్ అన్నాడని, ఇక డబ్బింగ్ పూర్తి అయ్యే సరికి బుజ్జి, కన్నా అంటూ వింతగా మాట్లాడడం మొదలు పెట్టాడని, అలా మాట్లాడుతుంటే చిరాగ్గా అనిపించిందని, ఇక నాకు అప్పటికే అతను చేయాలనుకుంటున్నది ఏంటో అర్థమై ఇక డబ్బింగ్ పూర్తి చేసుకొని వచ్చానని చెప్పింది.ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎవరా అని సునీత అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.

#Marriage #Singer Sunitha #SingerSunitha #SingerSunitha #RealityShows

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు