ఆ తీపిగుర్తులు ఇంకా గుర్తున్నాయి.. సునీత ఏం చెప్పారంటే..?

కరోనా సెకండ్ వేవ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి.ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

 Singer Sunitha Comments About Childhood Incident-TeluguStop.com

ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే.కరోనా తీవ్రత దృష్ట్యా స్టార్ సింగర్ సునీత ఇంటికే పరిమితమై ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు చేరువ అవుతున్నారు.

అయితే తాజాగా ఒక నెటిజన్ సింగర్ సునీత తలకు చాలా సంవత్సరం క్రితం తగిలిన గాయం గురించి ప్రశ్నించగా ఆ గాయం గురించి సునీత చెప్పుకొచ్చారు.నిత్యం సోషల్ మీడియాలో ఫాలోవర్లతో ముచ్చటిస్తున్న సునీత అభిమానులు అడిగిన పాటలను పాడుతూ వస్తున్నారు.

 Singer Sunitha Comments About Childhood Incident-ఆ తీపిగుర్తులు ఇంకా గుర్తున్నాయి.. సునీత ఏం చెప్పారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రతిరోజూ కేవలం అరగంట మాత్రమే సునీత లైవ్ లోకి వస్తుండటంతో కొందరు అభిమానులు ఇంకొంచెం టైం పెంచమని సునీతను కోరుతున్నారు.

ఒక నెటిజన్ సునీత గాయాన్ని గమనించి ఆ గాయం గురించి ప్రశ్నించగా బాల్యంలో తగిలిన గాయమని ఆ గాయం గురించి తెలిపారు.

చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాదంలో ఐదారు కుట్లు పడ్డాయని సునీత తెలిపారు.ఆ తీపి గుర్తులు ఇంకా గుర్తున్నాయంటూ సునీత ఆ గాయం గురించి చెప్పుకొచ్చారు.

అయితే ఆ గాయం ఎలా జరిగిందనే విషయాన్ని మాత్రం సునీత వెల్లడించలేదు.

మరోవైపు నిన్న సునీత పుట్టినరోజు కాగా అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త సింగర్ల నుంచి పోటీ ఎదురవుతున్నా సింగర్ సునీతకు మాత్రం ఆఫర్లు అస్సలు తగ్గడం లేదు.సునీత ఒక్కో పాటకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువ మొత్తం తీసుకుంటారని తెలుస్తోంది.

సునీత పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే

.

#InstagramLive #Corona Virus #Singer Sunitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు