కూరగాయలు, పండ్లు కోస్తూ మధురమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న సింగర్ సునీత!

తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె డిజిటల్ రంగంలో ప్రముఖంగా రాణిస్తున్న రామ్ వీరపనేని ని వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

 Singer Sunitha Busy In Farming Video Viral Details,  Singer Sunitha, Farming Vid-TeluguStop.com

ఇక పెళ్లి తర్వాత సింగర్ సునీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతోపాటు, రెట్టింపు సంతోషంతో కనిపిస్తోంది.ఒకవైపు టివి షోలలో పాల్గొంటూనే, మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా దూసుకుపోతోంది.

ఇక భర్త రామ్ వీరపనేని అందించిన సపోర్టుతో అంచెలంచెలుగా ఎదుగుతూ దూసుకుపోతోంది సింగర్ సునీత.ఇక అందులో భాగంగానే వ్యవసాయం పనుల పై కూడా ఫోకస్‌ పెట్టింది సునీత.

ఇటీవలే సునీత అరటి తోటలో అరటిగెల కోస్తున్న వీడియోని పంచుకోగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక ఆ వీడియో సునీత అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేశారు.

చక్కర కేలీ ఎంత తియ్యగా ఉంటుందో తెలుసా.మీ గొంతు నుంచి వెలువడే పాట అంత తీయగా ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా మిమ్మల్ని ఈ విధంగా కూడా చూడటం మాకు ఎంతో హ్యాపీగా ఉంది అని, అలాగే వ్యవసాయం లో ఉన్న మాధుర్యం వేరే అంటూ అభిమానులు సునీత పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరోవైపు సునీత తాజాగా కూరగాయలు కోస్తూ కనిపించారు.వంకాయలు, ఆకుకూరలు కోస్తున్న వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతుంది.సునీత వ్యవసాయం పనులు చేస్తుంటే ఆమె పాడే పాట అంత మాధుర్యంగా ఉందని అంటున్నారు నెటిజన్స్.

ఇప్పటి వరకూ తనకు పాటలు, ఫ్యామిలీ అంటే ఇష్టం అని తెలిపిన సునీతకి వ్యవసాయం అంటే కూడా ఇష్టమనే విషయాన్ని తెలియజేసింది.గార్డెనింగ్‌, ఫార్మింగ్‌పై ఆమెకున్న ప్రత్యేక శ్రద్ధని ఇలా తన వీడియోల రూపంలో పంచుకుంటూ తెలియజేస్తుంది.

అభిమానుల మనసులను దోచుకుంటుంది.తనకు ఇలా పొలంలో పనిచేయడం అంటే కూడా చాలా ఇష్టం.

ఫ్రెష్ కూరగాయలు కోయడమంటే మరీ ఇష్టం అని సునీత చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube