సునీత డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..?

తెలుగులో పాటలు పాడటం, డబ్బింగ్ ద్వారా సింగర్ సునీత స్టార్ హీరోయిన్లకు సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.సునీతకు ఉన్న స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ మరే సింగర్ కు లేకపోవడం గమనార్హం.

 Singer Sunitha Birthday Special Interesting Things Know About Her-TeluguStop.com

అందంగా కనిపించే సునీతకు పదుల సంఖ్యలో సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఆమె సున్నితంగా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశారు.ఒకవైపు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటూనే సునీత యాంకర్ గా సత్తా చాటడం గమనార్హం.

చిన్న వయస్సులోనే సంగీతంలో శిక్షణ తీసుకున్న సునీత గులాబి సినిమాలోనీ ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో సాంగ్ ద్వారా గాయనిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ఆమె గాత్రానికి, పాడిన పాటలకు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు.

 Singer Sunitha Birthday Special Interesting Things Know About Her-సునీత డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తెలుగులో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సంపాదించుకున్న ఎంతోమంది హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పడం గమనార్హం.

Telugu Anushka, Bhoomika, Dubbing Artist, Genelia, Heroines Dabbing, Interesting Facts, Meera Jasmin, Ram Veerapaneni, Shriya, Singer Sunitha, Singer Sunitha Birthday, Singer Sunitha History, Soundarya, Tamanna-Movie

దాదాపు 500 సినిమాలకు సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారంటే సునీత ప్రతిభ గురించి సులువుగానే అర్థమవుతుంది.

తెలుగులో ఒక వెలుగు వెలిగిన మీరాజాస్మిన్, శ్రియ, అనుష్క, తమన్నా, జెనీలియా, సౌందర్య, భూమిక, మరి కొందరు హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పారు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం సునీత సింగర్ గా సత్తా చాటారు.19 సంవత్సరాల వయస్సులోనే కుమార్ గోపరాజుతో సునీత వివాహం జరగగా కొన్ని కారణాల వల్ల మొదట భర్తతో ఆమె విడిపోయారు.ఈ ఏడాది జనవరి నెలలో సునీత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు.

అటు సునీతకు, ఇటు రామ్ వీరపనేనికి ఈ వివాహం రెండో వివాహం కావడం గమనార్హం.కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రస్తుతం సునీత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.

ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ ద్వారా సునీత రోజూ అరగంట పాటు ప్రేక్షకులకు నచ్చిన పాటలను పాడి వినిపిస్తున్నారు.

#Singer Sunitha #Genelia #Ram Veerapaneni #Shriya #Tamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు