సింగర్ సునీత వెడ్డింగ్.. డ్యాన్స్ ఇరగదీసిన సుమ!

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత తనదైన శైలిలో పాటలు పాడి ప్రేక్షకులను అలరించి,నవ్వించి ప్రేక్షకుల మనసులలో చోటు సంపాదించుకుంది.తను సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసింది.

 Anchor Suma Dance At Singer Sunitha Wedding , Anchor Suma, Singer Sunitha Weddin-TeluguStop.com

కానీ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఇటీవల సునీత రెండో వివాహం ఎంతో వైభవంగా జరిగింది.

ఇందుకు టాలీవుడ్ ప్రముఖ నటులు ఎంతమంది వచ్చారు.

అయితే అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎంతమంది ప్రముఖులు రావాల్సి ఉండగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇక జనవరి 9న సింగర్ సునీత వివాహం ప్రముఖ వ్యాపారవేత్త రామ్ తో వివాహం జరిగింది.ఎంతో కాలం ఒంటరిగా గడిపిన తరువాత సింగర్ సునీత తీసుకున్నా ఈ నిర్ణయంపై అభిమానులు అభినందించారు.

ఇక ఈ వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగింది.ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది.ఇక పెళ్లి తర్వాత సింగర్ సునీత ఫుల్ బిజీ అయ్యారు.సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ రంగం లోకి అడుగుపెట్టారు.అలాగే ఎక్కువ సమయాన్ని భర్త రామ్ కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయించింది.

ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునీత తన పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది.

ఇక ఈ వేడుకల్లో జరిగిన మెహందీ ఫంక్షన్, వెడ్డింగ్ ఫంక్షన్ సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.తాజాగా సునీత మరో వీడియోను రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో పెళ్లి రోజు ఆమె ఇంట్లో జరిగిన హడావిడి ఉంది.తన పిల్లలతో కలిసి ఆడుకోవడం,మెహందీ ఫంక్షన్, జరిగిన సందడిని చూపించారు.

ఇక రేణు దేశాయ్ తో పాటు ఆమె కుమార్తె ఆద్య కూడా ఈ వీడియోలో కనిపించారు.ఇక ప్రముఖ యాంకర్ సుమ మెహందీ పెట్టుకుని మరీ డాన్స్ చేసింది.

ఇక సునీత నవ్వులు ఈ వీడియోకి హైలెట్ గా నిలిచాయి అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube