మాది పెళ్లి కాదు.. వేరు వేరు ఫ్యామిలీలు కలవడం అంతే: సింగర్ సునీత

సింగర్ సునీత.అద్భుతమైన గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి తెలుగు సంగీత ప్రియులను ఆమె అభిమానులుగా మార్చుకుంది.అలాంటి సింగర్ జీవితంలో ఎన్నో ఊహించని ఘటనలు.పెళ్ళైన కొద్దీ కాలానికే విడాకులు.ఆతర్వాత ఒంటరి మహిళగా పోరాటం.ఇలా ఎన్నో చేసింది.

 Singer Sunitha Sensational Comments On Second Marriage, Sunitha,singer Sunitha,s-TeluguStop.com

మంచి సింగర్ గా ఎదిగిన సమయంలో రెండో పెళ్లి చేసుకుంటున్నారు అని.అది అని ఇది అని ఆమెపై గాసిప్స్ వినిపించాయి.ఇక అప్పుడు రెండో పెళ్లి చేసుకునేది లేదు అని చెప్పిన సింగర్ సునీత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుంది.

ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకుంది.

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి కాస్త వాయిదా పడింది.ఇక ఈ నేపథ్యంలోనే సింగర్ సునీత తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ అందరూ ఆశ్చర్యపోయే కామెంట్స్ చేశారు.

ఆమె చేసిన కామెంట్స్ విన్న నెటిజన్లు సైతం.పెళ్ళికి మరో అర్ధం అంటే ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతగా సునీత ఏం చెప్పింది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న…

సింగర్ సునీత మీడియాతో మాట్లాడుతూ.”నా పెళ్లి అని కాదు.ఒక ఫ్యామిలీని ఇంకో ఫ్యామిలీలో కలుపుకోవడంలా జరిగింది అంతే.ఇది నా పెళ్లి అని కాదు.ఒక రెండు కుటుంబాలు కలుస్తున్నాయి.కాబట్టి ఈ పెళ్లి నాకు చాలా డివైన్‌గా అనిపిస్తోంది” అంటూ కామెంట్లు చేశారు.

ఇక సునీత-రామ్ పెళ్లి వేడుక ఈ నెల 27న హైదరాబాద్ లో జరగనున్నట్టు ప్రచారం జరగగా.ఆ పెళ్లి తేదీ జనవరికి వాయిదా వేశారు.

మరి జనవరిలో ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube