త్వరలోనే ఆ విషయాల గురించి చెప్తానన్న సింగర్ సునీత.. ప్రెగ్నెంటా అంటూ ప్రశ్న?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని విశేషమైన అభిమానులను పొందిన సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమెకు గాయనిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

 Singer Sunitha Tell About Those Things Question About Being Pregnant Details,  S-TeluguStop.com

ప్రస్తుతం ఇండస్ట్రీలో సునీత ఎంతో బిజీగా ఉంటున్నారు.సునీత గత ఏడాది రామ్ వీరపనేని అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈమె రెండవ వివాహం చేసుకోవడంతో మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.ఆ విమర్శలను పక్కన పెట్టి తన జీవితంలో ముందుకు నడవాలని భావించిన సునీత ప్రస్తుతం తన రెండవ వివాహం తర్వాత ఎంతో సంతోషంగా గడుపుతున్నానని తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సునీత మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్న అనంతరం ఇద్దరిదీ ఒకే ప్రొఫెషన్ కావడంతో వీరిద్దరూ కలిసి వీరి సొంత బిజినెస్ లను చూసుకుంటున్నారు.అలాగే సునీత ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కూడా ఉండిపోయారు.

ఇక రెండవ వివాహం తర్వాత సునీత తన జీవితం ఎంతో సంతోషంగా ఉందనే విషయాన్ని ఎన్నో వీడియోల ద్వారా తెలిపారు అలాగే సోషల్ మీడియాలో ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈమెకు సంగీతంతో పాటు వ్యవసాయం కూడా చేయడం ఇష్టమని తన తోటలో పనులను చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా సునీత తన భర్త రామ్ తో కలిసి సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేస్తూ… ఎంతో ప్రత్యేకమైన కొన్ని అనుభవాలను, త్వరలోనే మీతో పంచుకుంటాను అంటూ తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటో పై స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే సునీత గత ఏడాది జనవరి నెలలోనే రామ్ వీరపనేనిని వివాహం చేసుకోవడంతో కొందరు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ వారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే మరికొందరు మాత్రం సునీత చేసిన ఈ పోస్ట్ పై స్పందిస్తూ.మీరు ప్రెగ్నెంటా.ఇదే విషయాన్ని తెలియజేయబోతున్నారా.

అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే సునీతకు తన మొదటి భర్తకు ఇద్దరు పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే ప్రస్తుతం తన కూతురు కూడా సింగర్ గా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.ఇలా పెళ్లీడుకొచ్చిన పిల్లలను పెట్టుకొని సునీత మరొక వివాహం చేసుకోవడం ఏంటి అంటూ ఈమె రెండవ పెళ్లి గురించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలోనే సునీత తనకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అనుభవాలను మీతో పంచుకోవాలని చెప్పడంతో మరోసారి కామెంట్లు రావడం గమనార్హం.

Is Singer Sunitha Pregnant Singer Sunitha Sunitha Pregnant

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube