భర్తతో అపురూపమైన ఫోటో షేర్ చేసిన సింగర్ సునీత!

టాలీవుడ్ సింగర్ సునీత పరిచయం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే తన స్వరంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను తాకింది.

 Singer Sunitha, Ram Verapaneni, Shared Photo, Social Media,instagram Viral Comme-TeluguStop.com

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది.బుల్లితెరలో షోలో వ్యాఖ్యాతగా కూడా చేసింది.

ఎన్నో సినిమాలలో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది సునీత.ఇక కొన్ని రోజుల కిందట తాను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఎన్నో ఏళ్ల నుండి ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత రెండో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోవడంతో కొన్ని రోజుల కిందట బిజినెస్ మాన్ రామ్ వీరపనేని రెండో పెళ్లి చేసుకుంది.

ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారింది.ఇక తనకు సంబంధించిన ఫోటోలను, తన భర్తతో దిగిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.

ఓ వైపు కెరీర్ మరోవైపు జీవితాన్ని సరి సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటుంది.

Telugu Ram Verapaneni, Shared, Sunitha-Movie

ఇక ఈ మధ్య రామ్ తో దిగిన ఫోటోలను అభిమానులకు బాగా షేర్ చేసుకోగా తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా మరో ఫోటో షేర్ చేసుకుంది సునీత.అందులో తన భర్త చేతిలో తన చెయ్యేసి ఉన్న ఓ అపురూప ఫోటోను అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా ఈ ఫోటోను చుసిన నెటిజన్లు మొత్తానికి సునీత ముఖంపై చిరునవ్వు వచ్చిందంటూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ కోరుతున్నారు.

ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కూడా తెగ ముచ్చట్లు పెడుతుంది.అంతేకాకుండా వారి కోసం తన పాటలను పాడి వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె బుల్లితెరలో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ షోలో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక పాడుతా తీయగా లాంటి తరహా మరో కొత్త షో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుందని అందులో సునీత తన సంగీతాన్ని వినిపించడానికి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube