అతనిని తలచుకొని షోలో కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ సునీత..!

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈమె రెండవ వివాహం చేసుకున్న తర్వాత తన కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 Singer Sunita Remembers Him And Get Very Emotional On Show Singer Sunitha, Tolly-TeluguStop.com

ఒకవైపు తన బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడమే కాకుండా మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా కొనసాగుతూ పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే పాడుతా తీయగా అనే కార్యక్రమానికి సునీత న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కంటెస్టెంట్ దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ప్రియతమా నా హృదయమా” పాట పాడుతుంటే. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎస్పీ బాలు తనయుడు చరణ్ ఈ పాట గురించి మాట్లాడుతూ తన తండ్రి బాలసుబ్రమణ్యంను తలచుకుని ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ఒకప్పుడు ఈ పాట నాకు ఎంతో ఇష్టమైనది… ప్రస్తుతం ఈ పాట చాలా కష్టంగా మారిందని బరువెక్కిన హృదయంతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.Telugu Chran, Paduta Tiyyaga, Sunitha, Tollywood-Movie

ఈ విధంగా ఈ పాటకు అర్థాన్ని వివరిస్తూ మాట్లాడలేక ఎమోషనల్ అయిన చరణ్ ను చూసి ఈ కార్యక్రమానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న సింగర్ సునీత కూడా బాలసుబ్రహ్మణ్యం గారిని తలుచుకొని షోలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే సునీతకు ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా సునీత తనని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడంతో షో మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube