శంషాబాద్ రామాలయం లో సింగర్ సునీత రెండో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.సినీ రాజకీయ, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.
వరుడు వీరపనేని రామ్ కి కూడా రెండో వివాహం కావటంతో.సునీత ఇద్దరూ పిల్లల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు చాలామంది బంధువులు రావడం జరిగింది.
కాగా ఈ వివాహ వేడుక సమయంలో సునీత కూతురు శ్రీయ కొద్దిగా ఎమోషనల్ అవ్వడం నెట్టింట్లో వైరల్ అయ్యింది.
ఇదిలా ఉంటే రెండో పెళ్లి అయిన వెంటనే సింగర్ సునీత షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.వస్తున్న టాక్ ప్రకారం. పెళ్లి అయిన నేపథ్యంలో కొద్దిగా ప్రైవసీ కోసం మీడియాకి దూరంగా ఉండటం మాత్రమే కాక తన ఫోన్ కాంటాక్ట్స్ మొత్తం బంద్ చేసేలా సునీత నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
అంతేకాకుండా ఫిబ్రవరి వరకు ఒప్పుకున్న ఈవెంట్లు కూడా మొత్తం క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం.సో మొత్తంమీద చూసుకుంటే రానున్న రెండు నెలలు సింగర్ సునీత ఫ్యాన్స్ కి కూడా అందుబాటులో ఉండదు అనే టాక్ మీడియా సర్కిల్స్ లో వినబడుతోంది.