చున్నీ సరిగ్గా వేసుకోమన్నారు.. వేధింపులపై సింగర్ ఘాటు వ్యాఖ్యలు

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. మహిళలపై అఘాయిత్యాలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను అమలులోకి తీసుకురావడంతో పాటు ఉన్న చట్టాలలో కీలక మార్పులు చేస్తున్నాయి.

 Singer Sona Mohapatra Recalls Harassments In Her College Days, Singer Sona Mohap-TeluguStop.com

అయితే ఎన్ని చట్టాలు అమలులోకి వస్తున్నా దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.తాజాగా ప్రముఖ లేడీ సింగర్ సమాజంలో మహిళలకు ఎదురవుతున్న వేధింపుల గురించి మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ లో వివాదాస్పద సింగర్ గా పేరు తెచ్చుకున్న సోనా మొహపాత్ర గతంలో జరిగిన మీటూ ఉద్యమంలా ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్ అనే ఛాలెంజ్ ను మొదలుపెట్టారు.ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్ ద్వారా బాధితులనే దోషులుగా చేసిన ఘటనల గురించి వెల్లడించాలని అన్నారు.

ఈ సందర్భంగా కాలేజీలో చదువుకునే సమయంలో ఎదురైన ఒక అనుభవం గురించి సోనా మొహపాత్ర సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

తాను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో సల్వార్ దుస్తులు ధరించి క్లాసుకు వెళుతున్నానని.

ఆ సమయంలో సీనియర్లు తన లోదుస్తుల గురించి అసభ్యకరంగా కామెంట్లు చేశారని అన్నారు.ఆ తరువాత ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి చున్నీ సరిగా వేసుకోమని సూచించాడని తెలిపారు.

మీ జీవితంలో కూడా ఇలాంటి వేధింపులు ఎదురైతే ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్ అనే ఛాలెంజ్ ద్వారా పంచుకోవాలని అన్నారు.

హీరోయిన్లు, సింగర్లను సోనా మొహ‌పాత్ర తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు.

ఒక నెటిజన్ కొందరు సింపతీ కోసం అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఇలాంటి పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు.కామెంట్లు చేస్తే బాధపడుతున్న మీరు హాట్ హాట్ ఫోటోషూట్లలో ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు.

ట్రోలింగ్ గురించి స్పందిస్తూ నా శరీరం, నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటానని సోనా మొహపాత్ర సమాధానం ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube